Good News to VRAs: వీఆర్ఏలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కారు

Good News to VRAs: వీఆర్ఏలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తెలంగాణ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో వీఆర్ఏల దశాబ్ధాల కల సాకారం కానుంది. విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలోపు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 19, 2023, 12:21 AM IST
Good News to VRAs: వీఆర్ఏలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కారు

Good News to VRAs in Telangana: వీఆర్ఏలకు తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా తెలంగాణ కేబినెట్ భేటీలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో వీఆర్ఏల దశాబ్ధాల కల సాకారం కానుంది. విఆర్ఏలను ఇతర ప్రభుత్వ శాఖల్లో సర్దుబాటు చేయడం ద్వారా వారికి రెగ్యులర్ స్కేల్ వచ్చే విధంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలోపు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీచేశారు. ఈ విషయంపై కేబినేట్‌లో నిర్ణయం తీసుకున్న అనంతరం విఆర్ఏ జెఎసి ప్రతినిధులను సీఎం కేసీఆర్ తన ఛాంబర్ కు ఆహ్వానించి వారితో పలు అంశాలపై చర్చించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు.  

బిఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసేదే పేద ప్రజల కోసమని, చిరుద్యోగులైన విఆర్ఏల సమస్యలను మానవత్వంతో వెంటనే పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. సుమారు 20 వేల మంది ఉన్న విఆర్ఏ లలో ముందుగా మెడికల్ ఇన్ వ్యాలిడేషన్ ప్రకారం అర్హులై దరఖాస్తున్న చేసుకున్న వారి వారసుల వివరాలు, వారి విద్యార్హతలు సేకరించాలని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. మిగతావారిని, వారి వారి అర్హతల ఆధారంగా మున్సిపల్, ఇరిగేషన్ (లష్కర్స్), రెవెన్యూ, జెడ్ పి, ఎడ్యుకేషన్, మెడికల్ కాలేజీలు, మిషన్ భగీరథ తదితర అవసరమైన శాఖల్లో స్కేల్ ఇస్తూ, తదుపరి ప్రమోషన్ వచ్చే విధంగా వారిని సర్దుబాటు చేయాలని ముఖ్యమంత్రి రెవెన్యూ కార్యదర్శి నవీన్ మిట్టల్ ను ఆదేశించారు. 

ఈ విషయంలో వీఆర్ఏల సమాచారం ఇవ్వడం సహా, అన్ని విషయాల్లో సమన్వయం చేయాలని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డికి సూచించారు. ముందుగా మొత్తం సమాచారాన్ని అధికారులకు అందజేయాలని, విఆర్ఏ జెఎసి ప్రతినిధులకు సూచించారు. విఆర్ఏలలో వారి విద్యార్హతలను బట్టి వారికి నచ్చిన ప్రభుత్వ శాఖలను ఎంచుకునే అవకాశం ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. 
telangana-cm-kcr-gives-good-news-to-VRAs-in-telangana.jpg 
ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు జి.జగదీష్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు సోమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సెక్రటరీలు స్మితా సభర్వాల్, భూపాల్ రెడ్డి, విఆర్ఎ జెఎసి ప్రతినిధులు రమేష్ బహదూర్, వెంకటేష్ యాదవ్, మాధవ నాయుడు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు. కేబినేట్ భేటీలో నిర్ణయం తీసుకొని తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించినందుకు విఆర్ఏ జెఎసి సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్‌కి కృతజ్ఞతలు తెలిపారు.

Trending News