Revanth Dawos Tour: దావోస్ పర్యటనలో మేఘా సహా పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు ఖరారు.. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ..

Revanth Dawos Tour: తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పలు ఉన్నతాధికారులతో కలిసి ఈ నెల 16న దాదాపు 8 రోజుల పర్యటన నిమిత్తం విదేశాలకు వెళ్లారు. ముందుగా సింగపూర్ వెళ్లిన రేవంత్ ఆ తర్వాత ప్రపంచ ఆర్ధిక సదస్సు నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్లారు. అక్కడ ముఖ్యమంత్రి సీఎం పలువురు ఇన్వెష్టర్లతో పాటు మెఘా కంపెనీతో కీలక ఒప్పందాలు చేసుకున్నారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Jan 22, 2025, 07:02 AM IST
Revanth Dawos Tour: దావోస్ పర్యటనలో మేఘా సహా పలు కంపెనీలతో కీలక ఒప్పందాలు ఖరారు.. తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ..

Revanth Dawos Tour:  తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20న సింగపూర్ నుంచి దావోస్ వెళ్లారు. అక్కడ పెట్టుబడిదారుల సదస్సులో తెలంగాణలో వ్యాపార అనుకూల వాతావరణంతో పాటు ఇక్కడ ప్రభుత్వం కల్పిస్తోన్న సదుపాయాలను వివరించారు. ఈ నేపథ్యంలో తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చాయి. దావోస్ పర్యటనలో రేవంత్‌ సర్కార్ తొలి ఒప్పందం కుదుర్చుకుంది. యూనిలివర్ కంపెనీ గ్లోబల్ సీఈవోతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జరిపిన చర్చలు విజయవంతమయ్యాయి. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచంలోనే పేరొందిన బ్రాండ్లలో ఒకటైన యూనిలీవర్ తెలంగాణలో పెట్టుబడులకు ఓకే చెప్పింది. మరోవైపు తెలంగాణలో తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ  యూనిలివర్ ఒప్పందం కుదుర్చుకుంది.

కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్ ని ఏర్పాటుకు అంగీకరించింది. తెలంగాణలో బాటిల్ క్యాప్ తయారీ యూనిట్ ను  నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. దావోస్ లోని తెలంగాణ పెవిలియన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి డి. శ్రీధర్ బాబుతో పాటు పరిశ్రమల శాఖ అధికారులు యూనిలివర్ సీఈవో హీన్ షూమేకర్, ఆ కంపెనీ చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విల్లెం ఉయిజెన్తో సమావేశమయ్యారు. మరోవైపు పలువురు పారిశ్రామిక వేత్తలతో రేవంత్ బృందం భేటీ అవుతోంది.

ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..

మరోవైపు సీఎం వంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం (World Economic Forum) లో  మరో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (Megha Engineering and Infrastructure Limited -MEIL) తో  రూ. 15 వేల కోట్ల విలువైన మూడు ఒప్పందాలను  కుదుర్చుకుంది. ఈ సందర్భంగా తెలంగాణ పెవీలియన్ లో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ప్రభుత్వ అధికారుాలు, మేఘా ఇంజినీరాంత్ ఎండీ పీవీ కృష్ణారెడ్డి అగ్రిమెంట్ పై సైన్ చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో  2160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్ట్ ఏర్పాటుకు ఎంవోయు పై ఇద్దరు సైన్ చేశారు. ఈ ప్రాజెక్టు పై రూ.11 వేల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది.  నిర్మాణ దశలో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. వర్క్ స్టార్ట్ అయ్యాకా..  మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అవసరమైన ఉద్యోగుల నియామకాలకు కంపెనీ క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ కూడా నిర్వహిస్తుందన్నారు.

ఈ చర్చల సందర్భంగా మేఘా ఇంజనీరింగ్ సంస్థ ఎండీ కృష్ణారెడ్డి  మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలుపంచుకునేందుకు ఈ ప్రాజెక్టు టేకప్ చేసినట్టు తెలిపారు.

దీంతో పాటు మెఘా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు మరో కీలక ఒప్పందం చేసుకుంది.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా  అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలపై సైన్ చేశాయి.

రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రదేశాలలో100 ఎంవీహెచ్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థను మేఘా  కంపెనీ అభివృద్ధి చేస్తుంది. దీనికి రూ.3000 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందకొచ్చింది. దీంతో రాబోయే రెండేళ్లలో  1000 మందికి  డైరెక్ట్ ఎంప్లాయిమెంట్..3000 మందికి ఇండైరెక్ట్ గా ఉపాధి లభించనుంది. ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది  

అంతేకాదు.. మెఘా కంపెనీ పర్యాటక రంగంలోనూ ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొచ్చింది.అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు కు చేసేందుకు మెఘా కంపెనీ తెలంగాణ గవర్నమెంట్ ఎంవోయు చేసుకుంది.హైదరాబాద్ కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్ ను అభివృద్ధి చేసేందుకు రూ.1000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది.

ఇదీ చదవండి:   గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!

ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News