/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Rythu Bharosa Scheme: ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో గతంలో కేసీఆర్‌ ఇచ్చిన రైతుబంధు రూ.12 వేలు ఇస్తుండగా తాము రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. అధికారంలోకి వచ్చి 8 నెలలు పూర్తవుతుండడం.. వర్షాకాలం పంటకాలం ప్రారంభమవడంతో రైతులు పెట్టుబడి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సమయంలో పంట పెట్టుబడి సహాయంపై తాజాగా మంత్రివర్గ ఉప సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

Also Read: KCR: బరాబర్‌ ఈసారి వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీనే.. రావడమే కాదు 15 ఏళ్లు పాతుకుపోతాం

రైతులు, కౌలు రైతులకు కూడా రూ.15 వేల పెట్టుబడి సహాయం ఇస్తామని చెప్పడంతో దానికి అనుగుణంగా నిబంధనలు రూపొందించడంపై మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటుచేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన ఉప సంఘం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉప సంఘంలో దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావును నియమించారు. రైతులు, కౌలు రైతులకు రైతు భరోసా పేరిట ఇచ్చే పెట్టుబడి సహాయంపై విధివిధానాలు ఖరారు చేయాలని ప్రభుత్వం తెలిపింది.

Also Read: KCR: కేసీఆర్‌ సంచలన ప్రకటన.. వాళ్లు పోతేపోనీ మిమ్మల్నే ఎమ్మెల్యేలుగా చేసుకుంటాం

రైతు భరోసాపై మంత్రుల ఉప సంఘం ఏర్పాటు చేయాలని గత నెల 22వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉప సంఘం ఏర్పాటుచేశారు. అయితే ఉప సంఘం ఏర్పాటు సరే కానీ రైతు భరోసా కింద ఎవరినీ అర్హులు చేస్తారనే ఆందోళన కలుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అత్యధిక భూములు కలిగిన వారికి, పన్నులు చెల్లించే వారికి పెట్టుబడి సహాయం అందించకూడదని పలుమార్లు ముఖ్యమంత్రి బహిరంగ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధును అధ్యయం చేసి ఇప్పుడు రైతులు, కౌలు రైతులకు ఎలా ఇవ్వాలనే దానిపై మంత్రివర్గ ఉప సంఘం సమాలోచనలు చేయనుంది.

కాగా మంత్రివర్గ ఉప సంఘం ఎలాంటి సిఫారసులు చేస్తుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. పెట్టుబడి సహాయం పొందేందుకు పది ఎకరాలు కొలమానంగా పెడతారని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇక పన్ను చెల్లింపుదారులు, ప్రభుత్వ ఉద్యోగులు తదితరులకు కూడా పెట్టుబడి సహాయం నుంచి మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంది. ఇక కచ్చితంగా రేషన్‌ కార్డు, ఆధార్‌ కార్డును చేసేలా పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఎలాంటి విధి విధానాలు ఖరారు చేస్తారో వేచి చూడాలి. భట్టి విక్రమార్క నేతృత్వంలో ఏర్పడిన ఉప సంఘం త్వరలోనే సమావేశం కానుంది. కాగా ఎప్పటిలోపు నివేదిక ఇవ్వాలనేది గడువు చెప్పకపోవడంతో వర్షాకాలం పంటకాలం పెట్టుబడి సహాయం దక్కదని తెలుస్తోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Section: 
English Title: 
Telangana Govt Appointed Sub Committee Under Bhatti Chairmanship For Rythu Bharosa Rv
News Source: 
Home Title: 

Sub Committee: రైతు భరోసాపై ఉప సంఘం.. రైతుల్లో ఎవరికీ కోత పెడుతారు? ఎవరినీ తీసేస్తారు?

Sub Committee: రైతు భరోసాపై ఉప సంఘం.. రైతుల్లో ఎవరికీ కోత పెడుతారు? ఎవరినీ తీసేస్తారు?
Caption: 
Rythu Bharosa Scheme Sub Committee (Source: File)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
Sub Committee: రైతు భరోసాపై ఉప సంఘం.. రైతుల్లో ఎవరికీ కోత పెడుతారు? ఎవరికి రాదు?
Ravi Kumar Sargam
Publish Later: 
No
Publish At: 
Tuesday, July 2, 2024 - 23:17
Created By: 
Ravi Kumar Sargam
Updated By: 
Ravi Kumar Sargam
Published By: 
Ravi Kumar Sargam
Request Count: 
15
Is Breaking News: 
No
Word Count: 
307