Jupally on Revanth:రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తనదైన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్యంగా తాము చెప్పిన హామిలను అమలు పరచడంలో విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారు. కులగణన తో పాటు పుష్ప టాపిక్.. తాజాగా ప్రధాని బీసీ కాదని ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రజల దృష్టిని మరలుస్తారనేది ప్రతిపక్షాల ఆరోపణ. పాలనలో పూర్తిగా విఫలమయ్యారని విపక్షాలు వాదిస్తున్నాయి. మరోవైపు స్వపక్షంలోని ఆయన సహచరులే ఆయన ఎపుడి దిగిపోతారని ఎదురు చూస్తున్నట్టు పొలిటికల్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు కొంత మంది సెలబ్రిటీలు ఆయన పేరును మరిచిపోతూ ఉండటం కూడా తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టిస్తున్నాయి.
ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరుని మరిచిపోతున్న ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. తాజాగా పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సైతం సీఎం రేవంత్ రెడ్డిని మరిచిపోయి సీఎం కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జగ్గారెడ్డి సైతం రేవంత్ రెడ్డి పేరుని మరిచిపోయి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఇదీ చదవండి: అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.
పుష్ప ఈవెంట్లో అల్లుఅర్జున్ సీఎం పేరుని మరిచిపోయినప్పటి నుంచి ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో రచ్చ జరుగుతోంది. జూపల్లి వ్యాఖ్యలపై భారీగా ట్రోలింగ్ జరుగుతోంది.
ముందుగా పుష్ప 2 రిలీజ్ తర్వాత జరిగిన సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్.. వేదికపై సీఎం రేవంత్ రెడ్డి పేరు మరిచిపోయారు. ఆ అవమానాన్ని రేవంత్ రెడ్డి.. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్బంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట జరిగడంతో ప్రభుత్వ వైఫల్యాన్ని సినిమా వాళ్లపై రుద్ది.. అల్లు అర్జున్ ను అక్రమంగా అరెస్ట్ చేయించి తన ఈగో సాటిస్ఫై చేసుకున్నారని ప్రతిపక్ష పార్టీలు సహా చాలా మంది సోషల్ మీడియా వేదికగా చెవులు కొరుక్కున్నారు. ముఖ్యంగా అపోజిన్ పార్టీలు మాత్రం అల్లు అర్జున్ ను అక్రమంగా అరెస్ట్ చేయించి తన అహం చల్లార్చుకున్నాడనే మాట వివపడింది.
ఆ తర్వాత జరిగిన ఓ వేడుకలో చంటిగాడు ఫేమ్ బాలాదిత్య.. రేవంత్ రెడ్డి పేరు కాకుండా.. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కు చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావించి రేవంత్ ను మరోసారి మరిచిపోయారు.
ఇదీ చదవండి: తాగుడుకు బానిసై సినీ కెరీర్ నాశనం.. 44 ఏళ్ల వయసులో స్టార్ హీరోయిన్ రెండో పెళ్లి..
ఇదీ చదవండి: వై టార్గెట్ చిరంజీవి.. ? మెగా ఫ్యామిలీని కావాలనే టార్గెట్ చేశారా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.