Minister Srinivas Goud: తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోస్యం

Minister Srinivas Goud Comments On KTR: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కేటీఆరే అంటూ జోస్యం చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాశంగా మారాయి. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 19, 2022, 04:52 PM IST
  • మా భవిష్యత్ నాయకుడు కేటీఆర్
  • మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్
  • మునుగోడులో టీఆర్ఎస్‌దే గెలుపు
Minister Srinivas Goud: తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్.. మంత్రి శ్రీనివాస్ గౌడ్ జోస్యం

Minister Srinivas Goud Comments On KTR: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన నేపథ్యంలో కేటీఆర్‌పై మంత్రి చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్ తెలంగాణ భవన్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని.. తమ భవిష్యత్ నాయకుడు ఆయననే మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మునుగోడును దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని ఇటీవల మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. కేటీఆర్ ముఖ్యమంత్రి అయితేనే.. మునుగోడు అన్ని విధాలుగా డెవలప్ అవుతుందన్నారు. కేంద్రంలో మార్పులు తీసుకువచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. ఆ పని పూర్తికాగానే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. 

మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీదే విజయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఓటమి భయంతో బీజేపీ డ్రామాలకు తెరలేపిందని ఫైర్ అయ్యారు. ఎలక్షన్ కమిషన్‌ను చేతిలో పెట్టుకుని కారును పోలిన గుర్తులను పెడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా.. మునుగోడులో టీఆర్ఎస్ గెలుపును ఎవరూ అడ్డుకోలేరన్నారు.

తెలంగాణను నాశనం చేసేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందని.. మత విద్వేషాలను రెచ్చగొడుతుందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సమయంలోనే బీజేపీ నాయకులకు హిందూత్వం గుర్తుకు వస్తుందని.. దుబ్బాక, హుజూరాబాద్ బై ఎలక్షన్స్‌లో చెప్పిన డైలాగ్స్ మళ్లీ మునుగోడులో చెబుతున్నారని అన్నారు. ఆ రెండు నియోజకవర్గాలకు కేంద్రం ఎన్ని నిధులు ఇచ్చిందని మంత్రి నిలదీశారు. 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో పోటీ చేస్తారనే ప్రచారంపై ఆయన స్పందించారు. ప్రజాసామ్యంలో ఎవరు ఎక్కడైనా పోటీ చేయవచ్చన్నారు. గతంలో చిరంజీవి వచ్చారని.. ఇప్పుడు ఇప్పుడు పవన్ వస్తారమోనని అన్నారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడం ఆయన వ్యక్తిగతమని శ్రీనివాస్ గౌడ్ అభిప్రాయపడ్డారు. 

Also Read: YS Viveka Case: వైఎస్ వివేకా హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. హంతకులెవరో తేలనుందా?

Also Read: మాజీ ఎమ్మెల్యేకు సీఎం జగన్ షాక్.. వైసీపీ నుంచి సస్పెండ్.. హిట్ లిస్టులో ఇంకెవరు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News