Ration Cards: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ పూర్తి కాగానే ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్న బియ్యం అందజేస్తామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చారిత్రక మార్పు కోసం కోసం కాంగ్రెస్ ముందడుగు వేసిందన్నారు ఉత్తమ్. గతంలో పెట్టుకున్న అప్లికేషన్ లు పరిశీలనలో ఉన్నాయన్నారు ఉత్తమ్. ఆహార భద్రత చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇంటి కోసం 5 లక్షలు అందజేస్తామన్నారు.
మరోవైపు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల ప్రజాగ్రహం పెల్లుబికింది. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తున్న గ్రామ సభలు రచ్చ రచ్చగా మారాయి. అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వ తీరుపై తిరగబడుతున్నారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంత కుంట మండలం పెద్దలింగాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో రచ్చ జరిగింది. మీసరగండ్ల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రేషన్ కార్డుల జాబితాలో తమ పేరు లేదని, తమకు ఇందిరమ్మ ఇళ్లు రాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఏమయ్యాయంటూ.. అగ్రికల్చర్ AO, KDCC అధికారులను నిలదీశారు. గ్రామంలో ఉన్న అర్హులందరికీ పథకాలు వర్తింప జేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి : చిరంజీవి, కీర్తి సురేష్ తల్లితో రొమాన్స్ చేసిన ఈ సినిమా తెలుసా..! అందులో మెగాస్టార్ విలన్..
తెలంగాణ కొత్త ఇవ్వబోతున్న రేషన్ కార్డు ఎవ్వరికి ఇవ్వాలనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. తెలంగాణలో కొత్తగా ఏర్పడిని 2014 నాటి మార్గదర్శకాలనే ప్రాతిపదికగా తీసుకోవడంపై విమర్శులు వెల్లువెత్తాయి. గ్రామాల్లో కుటుంబ సంవత్సర ఆదాయం లక్షన్నర రూపాయలు.. పట్టణాల్లో అయితే రెండు లక్షలుగా నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో మూడున్నర ఎకరాల కంటే తక్కువ విస్తీర్ణంలో మాగాణి పొలం ఉన్న రైతులు.. ఏడున్నర ఎకరాలు అంతకంటే తక్కువ మెట్ట భూములు ఉన్న వారిని అర్హులుగా ప్రకటించారు. కొత్త కార్డుల కోసం జనవరి 21 నుంచి 24 వరకు గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఇక తెలంగాణ లక్షలాది మంది కొత్త కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.
ఇదీ చదవండి: గడ్డకట్టే చలిలో నాగ సాదువులు నగ్నంగానే ఎందుకు ఉంటారు.. అసలు రహస్యం అదేనా..!
ఇదీ చదవండి : ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం నాగార్జున ‘అన్నపూర్ణ స్టూడియో’ మార్కెట్ విలువ ఎంతో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.