Corona in Telangana: తెలంగాణలో కరోనా ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. రాష్ట్రంలో తాజాగా 4,416 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర ఆరోగ్య విభాగం శుక్రవారం సాయంత్రం వెల్లడించింది. మొత్తం 1,20,243 టెస్టులకుగానూ.. ఈ కేసులు (Telangana Corona Update) నమోదయ్యాయి.
గురువారం సాయంత్రం ఐదున్నర నుంచి నేడు (శుక్రవారం) సాయంత్రం 5:30 వరకు ఈ కేసులు నమోదైనట్లు ఆరోగ్య విభాగం పేర్కొంది.
రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడ్డ వారి (Total Corona cases in Telangana) సంఖ్య 7,26,189 వద్దకు చేరింది.
రాష్ట్రంలో కరోనా రికవరీలు..
ఇక గడిచిన 24 గంటల్లో 1,920 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,93,623 మంది కరోనాను జయించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 95.43 శాతానికి తగ్గింది.
మహమ్మారికి రాష్ట్రంలో తాజాగా మరో ఇద్దరు (Corona deaths in Telangana) బలయ్యారు. రాష్ట్రంలో కొవిడ్ మృతుల సంఖ్య 4,069కు చేరినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. తెలంగాణలో కొవిడ్ మరణాల రేటు 0.56 శాతంగా ఉంది.
తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం 29,127 యాక్టివ్ కొవిడ్ (Active Corona cases in Telangana) కేసులు ఉన్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 3,11,69,198 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు ఆరోగ్య విభాగం వెల్లడించింది. ప్రతి పది లక్షల మందికి గానూ.. 8,37,431 పరీక్షలు చేసినట్లు తెలిపింది. ఇంకా 8,597 శాంపిళ్ల పరీక్షా ఫలితాలు తెలియాల్సి (Covid tests in Telangana) ఉందని పేర్కొంది.
Also read: Mood Of The Nation poll: ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలొస్తే.. బీజేపీకి ఎన్ని సీట్లోస్తాయంటే..!
Also read: Telangana: తెలంగాణలో మళ్లీ రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు... పెరగనున్న భూముల ధరలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Corona in Telangana: రాష్ట్రంలో కొత్తగా 4,400కు పైగా కరోనా కేసులు..
రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి
మహమ్మారికి మరో ఇద్దరు బలి
96 శాతం దిగువకు చేరిన రికవరీ రేటు