Minister Ktr Comments: టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణకు నిధులు ఇవ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోందన్నారు. విభజన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చాలేదని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించిన ఆయన అమిస్తాపూర్‌లో పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
వర్నె వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రూ.18 కోట్లతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం భూత్‌పూర్ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత భారీ బహిరంగసభలో ప్రసంగించారు. దేవరకద్ర నియోజకవర్గంలో ఒక్కరోజే రూ.119 కోట్లతో అభివృద్ధికి శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్..కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇస్తామని చెప్పి..విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 ఏళ్లలో ఒక్క పైసా కూడా ఇవ్వలేదని విమర్శించారు.
వికారాబాద్-కర్ణాటక, గద్వాల-మాచర్లకు రైలు అడిగినా స్పందన లేదన్నారు. పన్నుల రూపంలో కేంద్రానికి రూ.3.65 లక్షల కోట్లు తెలంగాణ ఇచ్చిందని గుర్తు చేశారు. ఇప్పటివరకు రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ఇచ్చింది రూ.1.68 లక్షల కోట్లేనని తెలిపారు. ఇది తప్పని నిరూపిస్తే..తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. దీనిపై రాష్ట్ర బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Also read: Monkeypox: ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ టెర్రర్..భారత్‌లోనూ తాజాగా కేసు నమోదు..!
Also read:Chandrababu Comments: హత్యల వెనుక వైసీపీ నేతల హస్తం..టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook