/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

Telangana Night Curfew Update: తెలంగాణలో త్వరలోనే నైట్ కర్ఫ్యూ విధించనున్నారనే వార్తలపై రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్) డి.శ్రీనివాసరావు స్పందించారు. రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ విధించే అంతటి కరోనా తీవ్రత లేదని అన్నారు. పాజిటివిటీ రేటు 10 శాతం దాటితే.. ఆ పరిస్థితుల్లో నైట్ కర్ఫ్యూ అవసరమని తెలియజేశారు. 

అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 3.16 శాతం కరోనా పాజిటివిటీ రేటు నమోదవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ ఆ 10 శాతం పాజిటివిటీ రేటు మించలేదని డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో 4.26 కరోనా పాజిటివిటీ రేటు ఉండగా.. మేడ్చల్ లో 4.22 శాతం,  మెదక్ జిల్లాలో అత్యధికంగా 6.45 శాతం, కొత్తగూడెంలో అతి తక్కువగా 1.14 శాతంగా ఉందని తెలంగాణ డీహెచ్ డి.శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా ఆంక్షలు అమలులో ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. 

రాష్ట్రంలో ఐసీయూ, ఆక్సిజన్‌ పడకల ఆక్యుపెన్సీ 61 శాతంగా అందుబాటులో ఉండడం సహా వారం రోజులుగా లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని డి.శ్రీనివాసరావు అన్నారు. ఇంటింటికి జ్వరం సర్వేతో పాటు లక్షణాలున్న 1.78 లక్షల మందికి కిట్లు పంపిణీ చేశామని ఆయన తెలిపారు. అయితే నేడు (జనవరి 25) రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. దీని కోసం వైద్యారోగ్య శాఖ ఇప్పటికే నివేదిక సమర్పించింది.  

ALso Read: Telangana Schools Reopen: రాష్ట్రంలో విద్యాసంస్థల రీఓపెన్ పై మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్లారిటీ

Also Read: Telangana Corona Cases: తెలంగాణలో పెరిగిన కరోనా ఉద్ధృతి.. కొత్తగా 3,603 కొవిడ్ కేసులు నమోదు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Telangana State Public Health Director Srinivas key statement on night curfew in State
News Source: 
Home Title: 

Telangana Night Curfew: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ.. డీహెచ్ శ్రీనివాసరావు కీలక ప్రకటన

Telangana Night Curfew: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ.. డీహెచ్ శ్రీనివాసరావు కీలక ప్రకటన
Caption: 
Telangana State Public Health Director Srinivas key statement on night curfew in State | Zee Media
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 
  • తెలంగాణలో నైట్ కర్ఫ్యూపై డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటన
  • ఇప్పట్లో రాత్రి కర్ఫ్యూ అవసరం లేదని వ్యాఖ్య
  • కరోనా పాజిటివిటీ రేటు 10 శాతం పెరిగితే తప్పదని వెల్లడి
Mobile Title: 
Telangana Night Curfew: తెలంగాణలో రాత్రిపూట కర్ఫ్యూ.. డీహెచ్ శ్రీనివాసరావు ప్రకటన!
ZH Telugu Desk
Publish Later: 
No
Publish At: 
Tuesday, January 25, 2022 - 13:21
Request Count: 
304
Is Breaking News: 
No