కేస్లాపూర్ (ఆదిలాబాద్) : తెలంగాణలోని ప్రసిద్ధ జాతర్లలో ఒకటైన నాగోబా జాతరను జనవరి 24 నుంచి మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించనున్నారు.. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జతర జరుగుతుంది. ప్రతీ ఏడాది, సంక్రాంతి పండుగ తర్వాత వేడుక నిర్వహిస్తారు. పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు తరలివస్తారు.
మెస్రం వంశీవులు ఈ నాగోబా జాతరలో కీలకపాత్ర పోషిస్తారు. జాతరలో మహాపూజ కోసం ఉపయోగించే పవిత్ర గోదావరి జలాలు తీసుకొచ్చేందుకు మెస్రం వంశీయుల పీఠాధిపతి వెంకట్ రావ్ పటేల్ ఆధ్వరంలో చర్చించారు. అనంతరం కొందరు వంశీయులు జలాల కోసం పయనమయ్యారు. అంతకుముందు మెస్రం వంశీవులు కేస్లాపూర్ చేరుకుని నాగోబా ఆలయంలో పూజలు నిర్వహించారు. జాతర జరిగే మూడురోజులపాటు మెస్రం వంశీయులు కేస్లాపూర్లోనే బస చేస్తారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..