Dengerious snakes Found in Shashabad Airport video viral: సాధారణంగా ఎయిర్ పోర్టులలో తరచుగా మనం బంగారం, వజ్రాలు దొంగతనంగా ట్రాన్స్ పొర్ట్ చేస్తుంటారు. పోలీసులకు, కస్టమ్స్ అధికారుల కళ్లు కప్పి వెళ్లేందుకు నానా తంటాలు పడుతుంటారు . కొంత మంది బంగారంను శరీరంలో కూడా పెట్టుకుని తీసుకెళ్తుంటారు. మరికొందరు లోదుస్తులలో కూడా పెట్టుకుంటారు. బంగారంను పెస్టు లాగా చేసి ఏదో రకంగా తప్పించుకునేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంటారు.
కానీ పోలీసులు మాత్రం అలాంటి వారిని పట్టుకుని , వారికి చుక్కలు చూపిస్తుంటారు. అయితే.. ఇప్పటి వరకు బంగారం, వజ్రాలు, డ్రగ్స్ ఇలాంటివి రవాణాలు చేసిన కేటుగాళ్లు అడ్డంగా బుక్కైన ఘటనలు మనం చూశాం. కానీ ఇక్కడ మాత్రం.. ఇద్దరు మహిళలు బ్యాంకాక్ నుంచి శంషాబాద్ కు వచ్చారు. వీరిద్దరు రవాణా చేస్తున్న వాటిని చూసి పోలీసులే ఖంగుతిన్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
శంషాబాద్ విమానాశ్రయంలో పాములు తరలిస్తున్న ఇద్దరు మహిళలు అరెస్ట్
బ్యాంకాక్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు మహిళల వద్ద పాములు ఉన్నట్లు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అధికారులు గుర్తించారు.
దీంతో విషపూరితమైన పాములను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొని.. మహిళలను అదుపులోకి తీసుకుని… pic.twitter.com/WPAIhcqneu
— Telugu Scribe (@TeluguScribe) November 25, 2024
బ్యాంకాక్ నుంచి ఇద్దరు మహిళలు శంషాబాద్ కు వచ్చారు .అయితే.. వీరి తీరు ఎందుకో కాస్తంతా అనుమానస్పదంగా పోలీసులకు కన్పించింది.దీంతో కస్టమ్స్ అధికారులు వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఆతర్వాత వారిదగ్గర ఉన్న బ్యాగులను చెక్కింగ్ చేయగా.. కొన్ని బాక్స్ లు కన్పించాయి. వాటిని తెరిచి చూడగా.. భయంకరమైన విషపూరీమైన పాములు కన్పించాయి. అసలు.. వీటిని బ్యాంకాక్ నుంచి ఇక్కడకు ఎలా తెచ్చారని పోలీసులు షాక్ అవుతున్నారంట.
Read more: Viral Video: ఉడుమును ఒక పట్టు పట్టిన మహిళ.. ఆమె ధైర్యానికి ఫిదా అవ్వాల్సిందే.. వీడియో వైరల్..
ఈ క్రమంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అసలు ఆ పాముల్ని ఎక్కడ బంధించారు. ఎక్కడకు తీసుకెళ్తున్నారు.. ఏం చేస్తారనే దానిపై విచారణ చేస్తున్నారంట. ఈ డెంజరస్ పాముల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.