Telangana Food Poison Cases: గురుకులాల్లో భోజనం సక్రమంగా లేక విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సంఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అలా వాంకిడి గిరిజన గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని విద్యార్థి శైలజ అస్వస్థతకు గురయి కొన్ని వారాల పాటు ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది. తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిన బాలిక మృతిపై బీఆర్‌ఎస్ పార్టీ అగ్ర నాయకత్వం స్పందించింది. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి హరీశ్ రావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భావోద్వేగానికి లోనయ్యారు. బాలిక మృతిపై సంతాపం ప్రకటించిన వారు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'రేవంత్ రెడ్డి ఇంకెంత మంది బిడ్డల ప్రాణం తీసుకుంటావ్' అంటూ నిలదీశారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత 'ఎక్స్' వేదికగా పోస్టులు చేశారు.
ఇది చదవండి: KT Rama Rao: పెండ్లికి పోతావో .. సావుకు పోతావో రేవంత్ రెడ్డి నీ ఇష్టం
రేవంత్ పాలనలో నరక కూపాల్లా మారిన గురుకులాలు.
సర్కార్ నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజ
ఈ దుర్మార్గపు కాంగ్రెస్ పాలనలో నాణ్యతలేని భోజనం తిని తీవ్ర అస్వస్థతకు గురై, గత 25 రోజులుగా వెంటిలేటర్ మీద నరకం అనుభవించి నేడు విద్యార్థిని కన్నుమూయడం కలచి… pic.twitter.com/svgXHz5X1N
— BRS Party (@BRSparty) November 25, 2024
బుక్కెడు బువ్వ పెట్టకుండా
'కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసింది. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శైలజ మృతి నన్ను ఎంతగానో కలచి వేసింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం వందలాది ప్రాణాలు బలి తీసుకున్న కాంగ్రెస్ పార్టీ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సంక్షేమ పాఠశాలలో కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా 11 నెలల్లో 43 మంది విద్యార్థుల ప్రాణాలు తీసింది. ఇవన్నీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన హత్యలే'
- కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్
ఇది చదవండి: Adani Donation: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం.. అదానీ రూ.వంద కోట్ల విరాళం తిరస్కరణ
శైలజకు కన్నీటి నివాళి
'రేవంత్ సర్కారు నిర్లక్ష్యానికి బలైపోయిన వాంకిడి గిరిజన గురుకుల విద్యార్థిని శైలజకు కన్నీటి నివాళి. మీ ప్రాణాలు బలి తీసుకున్న పాపం.. ఈ దుర్మార్గపు కాంగ్రెస్‌ను వెంటాడుతది. 25 రోజులుగా నువ్వు వెంటిలేటర్ మీద అనుభవించిన నరకానికి ప్రభుత్వమే జవాబుదారీ. ఆ తల్లిదండ్రులకు గుండె కోతను మిగిల్చిండు రేవంత్ రెడ్డి. విషాహారంతో చిన్నారి కన్నుమూయడం కలిచి వేస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారింది. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది'
- హరీశ్ రావు, మాజీ మంత్రి
ఎంతమంది కడుపుకోతకు కారణమవుతావు?
'పెద్ద చదువులు చదివేందుకు గురుకులాల్లో చేరిస్తే మరో పేద గిరిజన బిడ్డను బలి తీసుకుంటివి. 20 రోజులుగా నిమ్స్ లో ఉంటే కనీసం ఒక్కరోజైనా పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించకపోతివి. గురుకులాల్లో భద్రంగా ఉండాల్సిన అమాయక విద్యార్థులు నీ పనితీరుతో నెలకు ముగ్గురు చొప్పున నేలరాలిపోతున్నారు. సీఎంగా నీకు పేదల పిల్లల బాధలు పట్టవాయే. విద్యాశాఖ మంత్రి లేక విద్యార్థులకు తిప్పలు తప్పవాయే. ఎంతమంది తల్లిదండ్రుల కడుపుకోతకు కారణమవుతావు? ఎంతమంది బిడ్డలు మరణిస్తే నీ గుండెకరుగుతుంది రేవంత్?!'
- కవిత, బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, భారత్ జాగృతి అధ్యక్షురాలు
కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పరిపాలన మరో పేదబిడ్డ ప్రాణం తీసింది. కన్నతల్లికి కడుపు కోత మిగిల్చింది. వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం వల్ల అస్వస్థతకు గురై 20 రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణ వార్త నన్ను ఎంతగానో కలచి వేసింది.
ఆనాడు తెలంగాణ రాష్ట్రం…
— Kavitha Kalvakuntla (@RaoKavitha) November 25, 2024
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి