Lashkar Bonalu 2024: సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ఎప్పుడు?.. కలరాను రూపుమాపిన లష్కర్ అమ్మవారి చరిత్ర ఇదే...

Bonalu festival 2024: ఆషాడ మాసంలో బోనాల పండుగను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఊరువాడ, పల్లె, పట్నం తేడాలేకుండా బోనాలను వేడుకగా నిర్వహిస్తారు. ఇప్పటికే గోల్కొండలో తొలిబోనంను సమర్పించారు.దీంతో వేడుకకు అంకురార్పణ జరిగిందని చెప్పుకొవచ్చు.

Written by - Inamdar Paresh | Last Updated : Jul 9, 2024, 01:48 PM IST
  • లష్కర్ బోనాలకు జోరుగా ఏర్పాట్లు..
  • స్వయంభూగా వెలసిన అమ్మవారు..
Lashkar Bonalu 2024:  సికింద్రాబాద్ ఉజ్జయిని బోనాలు ఎప్పుడు?.. కలరాను రూపుమాపిన లష్కర్ అమ్మవారి చరిత్ర ఇదే...

Secunderabad bonalu 2024 Lashkar Ujjaini mahankali temple history:  ఆషాడంను శూన్య మాసం కాదు.. పండుగ మాసం అని పిలవాలని చెప్తుంటారు. ఈ మాసంలోనే అమ్మవారికి బోనాలు, పవిత్రమైన ఏకాదశి, జగన్నాథుడి రథయాత్ర, చాతుర్మాస్యవ్రతం కూడా ఈనెలలోనే ప్రారంభమౌతుంది. అంతటి పవిత్రమైన ఈ మాసంలో అనేక పండుగలు వరుసగా వస్తుంటాయి. ఇదిలా ఉండగా.. తెలంగాణలో బోనాల పండగను వందల ఏళ్ల నుంచి ఎంతో భక్తితో జరుపుకుంటాం. బోనం అంటే భోజనం. ముఖ్యంగా అమ్మవారు ఆషాడంలో పుట్టింటికి వెళ్తుందని చెబుతుంటారు. దీనికి గుర్తుగా ప్రతి ఒక్కరు తమ ఇళ్లలో, ఆయాగ్రామంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేకంగా బోనం సమర్పిస్తారు.

Read more: Snake Crawling: నిద్రలో ఉన్న యువతిపై దూసుకొచ్చిన పాము.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

బోనాలు సమర్పిచడంలో వారి వారి సాంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. వేప కొమ్మలు, పొతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పులు, తొట్లే ఊరేగింపులు, ఫలాహరం బండ్లు, ఇలా బోనాలలో భక్తులు కొన్ని ఆచారాలను పాటిస్తుంటారు.హైదరాబాద్ లో బోనాలు ముఖ్యంగా గోల్కొండ, బల్కంపేట ఎల్లమ్మ, సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళిలకు బోనాలు సమర్పిస్తారు. జులై 7 న ప్రారంభమైన ఈ బోనాల ఉత్సవాలు.. ఆగస్టు నెల 4 వరకు కొనసాగుతాయి.గోల్కొండ కోటలో ప్రారంభమయ్యే బోనాల వేడుకలు తిరిగి 9వ పూజతో గోల్కొండ కోటలోనే ముగియనున్నాయి.

గోల్కొండ జగదాంబిక అమ్మ అక్కాచెల్లెళ్లైన మహంకాళి, ఎల్లమ్మ, పోచమ్మ , నల్లపొచమ్మ, చిత్తారమ్మ..అనే మొత్తం ఏడుగురు అక్కచెళ్లెళ్లకు పండుగలో భాగంగా బోనాలు సమర్పిస్తారు. తొలిబోనం గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి సమర్పించిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బోనాల సంబరాలకు అంకురార్పణ జరుగుతుందని చెప్పొచ్చు. రెండో బోనం బల్కంపేట ఎల్లమ్మకు, మూడోబోనం లష్కర్‌గా పిలిచే సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి, నాలుగో బోనం లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవార్లకు సమర్పించటం ఆనవాయితీ.

ఉజ్జయిని మహంకాళి ఆలయం చరిత్ర..

 ఉజ్జయని మహాంకాళి దేవాలయం 1815లో నిర్యించారు. సికింద్రాబాద్ పాత బోయిగూడ లో ఉండే.. సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు.  1813 సంవత్సరంలో ఉద్యోగ రీత్యా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ చేశారు.  కొద్దిరోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. అప్పుడు.. అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయినిలో కలరా వ్యాధి నుండి ప్రజలను కాపాడలని,  తన స్వస్థలమైన సికింద్రాబాద్ (లష్కర్)లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామనీ భక్తితో వేడుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కలరా వ్యాధి పూర్తిగా మాయమైపోయింది.

అమ్మవారు వారి మహత్యం వల్లే ఇది సాధ్యమైందని,  సురటి అప్పయ్య, ఆయన మిత్రులు విశ్వసించారు. ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్‌కు వచ్చి,  కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి ఒక ఆలయం నిర్మించారు. కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఉజ్జయిని మహంకాళిగా నామకరణ చేసి పూజలు ప్రారంభించారు. 

ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావటంతో, సికింద్రాబాద్‌లోనూ ఆషాఢంలో జాతర జరపాలని అక్కడి వాళ్లు నిర్ణయించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడ్డబావిలో పూడిక తీస్తున్నారు. ఇంతలో.. బావి నుంచి మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు. 1815 నుండి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం బోనాల జాతర నిర్వహించి, వ్యాధులు బాధల నుండి ప్రజలను రక్షించాలని ఆయన నిర్ణయించారు. అప్పటి నుండి గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఆషాఢంలో సికింద్రాబాద్ వాసులు బోనాల జాతర జరుపుకుంటున్నారు. ఇప్పటికి కూడా ఉజ్జయిని అమ్మవారు భక్తులకు కొంగుబంగారంగా అనుగ్రహిస్తారని భక్తులు చెబుతుంటారు.

సికింద్రాబాద్ లో జరిగే బోనాలను లష్కర్‌ అంటారు. ఇక్కడ  2 రోజుల పాటు సాగే బోనాల వేడుకల్లో తొలిరోజు తెల్లవారు జామునే అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం భక్తులు బోనాలను అనుమతిస్తారు. తొలిరోజు బోనాలు ఎక్కించగా రెండో రోజు అమ్మవారికి బలి, రంగం, గావు పట్టడం, ఏనుగు అంబారీ ఊరేగింపులతో ఆద్యంతం ఆకట్టుకుంటాయి.

Read more: Sonu Sood: హీరో సోనూసూద్ కు బంపర్ ఆఫర్ ఇచ్చిన కుమారీ ఆంటీ.. వీడియో వైరల్.. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News