Hijab Controversy: హిజాబ్ వివాదంలో హోంమంత్రి మహమూద్ అలీ

Hijab Controversy: మహిళల వస్త్రధారణ పై ఈరోజు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. హోంమంత్రి వెంటనే తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి అని రాణి రుద్రమ రెడ్డి డిమాండ్ చేశారు. 

Last Updated : Jun 18, 2023, 04:51 AM IST
Hijab Controversy: హిజాబ్ వివాదంలో హోంమంత్రి మహమూద్ అలీ

Hijab Controversy: మహిళల వస్త్రధారణ పై ఈరోజు తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటు అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ రెడ్డి అన్నారు. హోంమంత్రి వెంటనే తెలంగాణ మహిళలకు క్షమాపణ చెప్పాలి అని రాణి రుద్రమ డిమాండ్ చేశారు. మహిళలు నెత్తి మీద హిజాబ్ ధరిస్తేనే ప్రజలు ప్రశాంతంగా ఉంటారని మాట్లాడడం మహిళలను అవమానించడమే అవుతుంది అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఆరు నెలల పసి పాప నుంచి 60 ఏళ్ల వృద్ధురాలి వరకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలు, హత్యలపై ఏ రోజు మాట్లాడని హోమ్ మంత్రి మహమూద్ అలీ.. ఈరోజు మహిళల వస్త్రధారణే వాటికి కారణం అన్నట్లుగా మాట్లాడడం చేతగాని తనానికి నిదర్శనం అని రాణి రుద్రమ మండిపడ్డారు. ఒక హోంమంత్రి స్థానంలో ఉండి ఇలా మాట్లాడటం అంటే ఇది మహిళల ఆత్మగౌరవాన్ని అవమానించటమే, కించపరచడమే అని ఆవేదన వ్యక్తంచేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పసి పిల్లలపై, మైనర్లపై జరుగుతున్న అత్యాచారాలపై రోజుకు సగటున ఏడు POCSO కేసులు  కేసులు నమోదవుతున్నాయి. దానికి కూడా వస్త్రధారణ కారణం అవుతుందా అనేది బాధ్యత లేని హోంమంత్రి సమాధానం చెప్పాలి అని రాణి రుద్రమ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎంఐఎం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల చేతిలో అత్యాచారాలకు హత్యలకు గురవుతున్న మహిళలకు రక్షణ కల్పించలేని అసమర్ధ హోంమంత్రి మహమూద్ అలీ రాణి రుద్రమ మండిపడ్డారు.

ఇది కూడా చదవండి : Revanth Reddy : టిఎస్పీఎస్సీ చేపట్టిన ఆ నియామకాలను రివ్యూ చేయాలి

బీఆర్ఎస్ పార్టీకే చెందిన బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య  లైంగికంగా వేధిస్తున్నాడంటూ బాధిత మహిళ సెజల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా నేటికీ కేసు ఫైల్ చేయలేదు. దీంతో బాధితురాలు న్యాయం కోసం ఢిల్లీకి వెళ్లి న్యాయ పోరాటం చేయాల్సినటువంటి దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు పట్టింది. మహిళలకు మొదటి క్యాబినెట్లో ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేని వాళ్ళు, మహిళా కమిషన్ కు చైర్మన్‌ను ఆరెళ్లకుగానీ నియమించలేని చేతగాని ప్రభుత్వ పెద్దలు మహిళల వస్త్రధారణపై అవాకులు చెవాకులు పేలితే తెలంగాణ మహిళలు మీకు బుద్ధి చెప్పడం ఖాయం అని రాణి రుద్రమ హెచ్చరించారు.

ఇది కూడా చదవండి : TS Government New Scheme: గుడ్‌న్యూస్.. ఈ నెల 15న లక్ష సాయం.. ఇలా అప్లై చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News