Afghan Earthquake: ఆఫ్ఘన్ భూకంపంలో పెరుగుతున్న మృతుల సంఖ్య సహాయక చర్యల్లో ఆలస్యం

Afghan Earthquake: భారీ భూకంపంతో ఆఫ్ఘనిస్తాన్ మరోసారి వణికింది. వరుస మూడు భూ ప్రకంపనలతో భారీ భవనాలు నేలమట్టమయ్యాయి. మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఆప్ఘన్ భూకంపంలో పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 8, 2023, 06:41 AM IST
Afghan Earthquake: ఆఫ్ఘన్ భూకంపంలో పెరుగుతున్న మృతుల సంఖ్య సహాయక చర్యల్లో ఆలస్యం

Afghan Earthquake: భారీ భూకంపం ధాటికి ఆఫ్ఘనిస్తాన్ అతలాకుతలమైంది. నిన్నమద్యాహ్నం సంభవించిన వరుస ప్రకంపనలతో పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతంలో విధ్వంసం చోటుచేసుకుంది. వందలాది ఇళ్లు ధ్వంసం కావడంతో పెద్దఎత్తున మరణాలు సంభవించాయి.

ఆఫ్ఘనిస్తాన్-ఇరాన్ సరిహద్దుల్లోని హెరాత్ పట్టణ ప్రాంతంలో శనివారం మద్యాహ్నం భారీ భూకంపం సంభవించింది. ఆఫ్ఘనిస్తాన్ నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రతతో మొదటి సారి మద్యాహ్నం 12.11 గంటలకు భూమి కంపించింది. ఆ తరువాత మద్యాహ్నం 12.19 గంటలకు రెండవసారి 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇక మూడవసారి మద్యాహ్నం 12.42 గంటలకు 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఇలా వరుసగా మూడుసార్లు భూమి కంపించడంతో ఆ దేశం వణికిపోయింది. ముఖ్యంగా హెరాత్ పట్టణ పరిసరాలు, గ్రామీణ ప్రాంతాల్లో వందలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. కొండ చరియలు విరిగిపడ్డాయి. దాంతో బారీగా ప్రాణ, ఆస్థి నష్టం సంభవించాయి. 

ఈ భూకంపంపై అధికారికంగా ఎలాంటి ప్రకటనను తాలిబన్ ప్రభుత్వం విడుదల చేయలేదు. కానీ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం భారీగా ప్రాణనష్టం సంభవించినట్టు అంచనా. ఎందుకంటే చాలావరకూ పాత ఇళ్లు నేలకూలాయి. శిధిలాల కింద చాలామంది చిక్కుకుపోయారు. సహాయక చర్యలు ఏ మేరకు జరుగుతున్నాయనేది అంచనా లేదు. భూకంపం ధాటికి హెరాత్ ప్రావిన్స్ అత్యధికంగా ప్రభావితమైంది. 

యూఎస్ జియోలాజికల్ సర్వే  ప్రకారం భూకంపం కేంద్రం హెరాత్‌కు వాయవ్యంగా 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. శుక్రవారం రాత్రి నుంచి పరిశీలిస్తే శనివారం మద్యాహ్నం వరకూ భూమి 5 సార్లు కంపించింది. నేలకూలిన వందలాది ఇళ్ల శిధిలాలను తొలగిస్తేనే ప్రాణనష్టం ఎంత ఉండవచ్చనేది తెలుస్తుంది. ఇప్పటి వరకూ 300కు పైగా మరణించినట్టు సమాచారం అందుతోంది. 500 కు పైగా గాయపడినట్టు తెలుస్తోంది. 

Also read: Israel-Hamas Attacks: ఇజ్రాయిల్-హమాస్ మధ్య దాడులు ప్రతీకార దాడుల్లో వందలాది మంది మృతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News