Covaxin Deal: మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. అవినీతి ఆరోపణల నేపధ్యంలో ఆ ఒప్పందం రద్దైంది. వ్యాక్సిన్ సరఫరాలో భారీగా ముడుపులు ముట్టాయనేది ప్రధాన ఆరోపణ.
భారత్ బయోటెక్ (Bharat Biotech)కంపెనీ అభివృద్ధి చేసిన మేకిన్ ఇండియా వ్యాక్సిన్ కోవాగ్జిన్‌కు అంతర్జాతీయంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన జాబితాలో లేకపోవడంతో విదేశీ ప్రయాణాలకు ఇబ్బంది ఎదురవుతోంది. ఫలితంగా గుర్తింపు కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.ఇప్పుడు అవినీతి జరిగిందనే వ్యవహారంలో..ముడుపులు ముట్టాయనే ఆరోపణలపై భారీ ఒప్పందం రద్దైంది.
కోవాగ్జిన్ డీల్(Covaxin Deal)ను బ్రెజిల్ ప్రభుత్వం రద్దు చేసుకుంది. 2 కోట్ల కోవాగ్జిన్ సరఫరాకు బ్రెజిల్ ప్రభుత్వంతో భారత్ బయోటెక్ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ ఏకంగా 2 వేల 234 కోట్ల రూపాయలు. వ్యాక్సిన్ సరఫరాలో ముడుపులు ముట్టాయని ఆ దేశపు సెనెటర్లు ఆరోపించడంతో వివాదాస్పదంగా మారింది. 734 కోట్ల మేర ముడుపులు మధ్యవర్థి కంపెనీతో పాటు బ్రెజిల్ ప్రెసిడెంట్ ముట్టాయనేది సెనేటర్ల ఆరోపణ. బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో కోవాగ్జిన్‌పై(Covaxin vaccine)ప్రత్యేక ఆసక్తి కనబరిచారని..ఆయన సన్నిహితులకు లబ్ది చేకూరేలా లావాదేవీలు జరిగాయని ఆరోపణలు చుట్టుమడుతున్నాయి. ఈ నేపధ్యంలో ప్రభుత్వం(Brazil government) మొత్తం డీల్ రద్దు చేసుకుంది.
Also read: Oxford Study on Vaccines: వ్యాక్సిన్ డోసుల మధ్య విరామం పెరిగితే ప్రయోజనం అధికం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook