Can You Get Covid-19 Twice: కరోనావైరస్ ఒక్కసారి సంక్రమించిన తరువాత మళ్లీ వస్తుందా అనేది ప్రస్తుతం ప్రపంచం ముందున్న పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం కొంత మంది పరిశోధకులు వస్తుంది అంటున్నారు. మరికొంత మంది రాదు అంటున్నారు. ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. అయితే శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనల్లో కోవిడ్-19 వైరస్ ( Covid-19 Virus ) ఒక సారి సోకితే మళ్లీ సోకదని తెలిసింది. ( Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ? )
ఒకసారి వస్తే రెండో సారి రాదని శాస్త్రవేత్తలు ఇటీవలే నిర్వహించిన పరిశోధనలో తేల్చారు. మొదటి సారి కరోనావైరస్ (Coronavirus ) సోకినప్పుడు వ్యక్తి శరీరంలో యాంటీబాడీస్ ( Antibodies To Covid-19 ) సిద్ధం అవుతాయి అని తెలిపారు. దీంతో పాటు వారిలో టీసెల్స్ కూడా ( T- Cells For Coronavirus ) కోవిడ్-19 వైరస్‌తో పోరాటం చేస్తాయని చెబుతున్నారు. దీనిపై పలువురు శాస్త్రవేత్తలు కరోనావైరస్ మళ్లీ సోకదని స్పష్టంగా చెబుతున్నారు.
కానీ దీనిపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే దక్షిణా కొరియా వంటి దేశాల్లో వైరస్ రెండో సారి అటాక్ చేసిన కేసులు కలవరం పెట్టాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇలా రెండో సారి కరోనావైరస్ ( Covid-19 Reinfection ) సోకిన వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలాంటి పరిస్థితిలో వైరస్ మళ్లీ రాదు అనే విషయాన్ని శాస్త్రవేత్తలు చెబుతున్నా నమ్మలేని పరిస్థితి ఏర్పడుతోంది. అయితే శాస్త్రవేత్తల తాజా పరిశోధన ఈ విషయంలో ఆశలు రేకెత్తిస్తున్నాయి.
Quarentine Tips: హోమ్ క్వారంటైన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే