Chicago Woman isolates in toilet for five hours after tested positive in mid-flight: కరోనా వైరస్ కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ (Omicron) ప్రపంచదేశాలను వణికిస్తోంది. ఇతర వేరియెంట్‌ల కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతుండంతో చాలా దేశాలు కఠిన ఆక్షలు అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలో విదేశాల నుంచి వస్తున్న వారికి ఎయిర్ పోర్టు (Air Port)లోనే టెస్టులు చేస్తున్నారు. పాజిటివ్ వస్తే అక్కడే ఐసొలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అయితే విమానం (Plane)లో ప్రయాణిస్తుండగా పాజిటివ్ వస్తే.. వారి పరిస్థితిని ఎవరికి చెప్పడానికి కూడా ఉండదు. ఐసొలేషన్‌లో ఉండడానికి టాయిలెట్ (Plane Restroom) తప్ప మరోదారి ఉండదు. ఇలాంటి పరిస్థితే ఓ మహిళ ఎదుర్కొన్నారు. అయితే విమానంలో ఎవరు టెస్టు చేసుకుంటారు అనే అనుమానం మీకు రావచ్చు. వివరాల్లోకి వెళితే...
చికాగో (Chicago)కు చెందిన మరిసా ఫోటియో అనే ఉపాధ్యాయురాలు (US Teacher) తన తండ్రి మరియు సోదరుడితో కలిసి సెలవుల కోసం ఐస్‌లాండ్‌కు బయలుదేరారు. విమానం ఎక్కడానికి ముందే ముగ్గురు రెండు ఆర్టీ-పీసీఆర్ టెస్టులు, ఐదు ర్యాపిడ్ టెస్టులు చేయించుకున్నారు. అన్నింటిలోనూ కరోనా నెగెటివ్ అనే ఫలితం వచ్చింది. దాంతో డిన్నర్ చేసిన మరిసా ఫోటియో.. కుటుంబంతో కలిసి విమానం ఎక్కారు. విమానం ఎక్కిన (Mid-Flight) గంటన్నర తర్వాత మరిసాకు గొంతులో నొప్పి వచ్చింది. వెంటనే బయపడిపోయిన ఆమె.. కరోనా సోకిందనే అనుమానం వచ్చింది. అయితే ఐదుసార్లు టెస్టులు చేసుకున్నా కదా అని మరిసాకు ఇంకో ఆలోచన వచ్చింది. దాంతో ఆమె మనసు కాస్త కుదుటపడింది.
Also Read: BBL 2021: అబాట్ స్టన్నింగ్ క్యాచ్.. ఔట్ అయ్యాననే సంగతి మరచిపోయిన క్రిస్ లిన్ (వీడియో)!!
మరిసా ఫోటియోకు గొంతు నొప్పి మరింత ఎక్కువ అవడంతో.. కరోనా సోకిందనే అనుమానం ఆమె మదిలో మళ్లీ మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరిసా ముందుజాగ్రత్తగా.. తన వెంట ర్యాపిడ్ టెస్ట్ కిట్‌ను తీసుకువెళ్లారు. కిట్ తీసుకుని టాయిలెట్ (Plane Toilet)కు వెళ్లి టెస్ట్ చేసుకోగా.. కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దాంతో మరిసా ఒక్కసారిగా షాక్ తిన్నారు. విమానంలో తన కుటుంబం, తోటి ప్రయాణికులు ఉండడంతో ఆందోళనకు గురయ్యారు. టాయిలెట్ డోర్ తీసి ఎదురుగా ఉన్న ఫ్లైట్ అటెండాంట్‌ను పిలిచి విషయం చెప్పారు. విమానంలో ప్రయాణికులు ఫుల్‌గా ఉండడంతో.. ఇద్దరికీ ఏం చేయాలో తోచలేదు.
తన ద్వారా కరోనా మహమ్మరి వేరేవారికి సోకవద్దని భావించిన మారిసా ఫోటియోనే చివరకు ఓ నిర్ణయం తీసుకున్నారు. టాయ్‌లెట్‌లో ఐసొలేట్ అవుతానని ఫ్లైట్ అటెండాంట్‌కు చెప్పారు. అయితే ఆ టాయ్‌లెట్‌లోకి ఎవరినీ రాకుండా ఫ్లైట్ అటెండాంట్ చూసుకున్నారు. అలా విమానం లాండ్ అయ్యేవరకు.. అంటే ఐదు గంటల పాటు మారిసా టాయ్‌లెట్‌లోనే ఉండిపోయారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యాక అందరి కన్నా చివరిగా మారిసా విమానం దిగారు. మారిసా సోదరుడు, తండ్రికి మరోసారి టెస్ట్ చేయగా.. నెగెటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. దాంతో వారిద్దరు కనెక్టింగ్ ఫ్లైట్ ఎక్కడానికి అధికారులు అనుమతించారు. మారిసా మాత్రం ఐస్‌లాండ్‌లోనే పది రోజులు క్వారంటైన్‌లో ఉన్నారు.
Also Read: Video: గుడ్ల నుంచి కాదు.. నేరుగా పాము కడుపు నుంచే బయటకొచ్చిన పిల్ల పాము..
ప్రస్తుతం ఐస్‌లాండ్ (Island) రాజధాని రెక్జావిక్‌లోని రెడ్‌క్రాస్ హ్యుమానిటేరియన్ హోటల్‌లో మారిసా ఫోటియో (Marisa Fotieo) నిర్బంధంలో ఉన్నారు. విమాన ప్రయాణ సమయంలో తనకు సహాయం చేయడానికి తన వంతు కృషి చేసిన ఫ్లైట్ అటెండెంట్‌ను ఆమె ప్రశంసించారు. హోటల్‌లో బస చేయడం సౌకర్యంగా ఉందని, ఆమె త్వరలో బయలుదేరాలని ప్లాన్ చేసుకున్నట్లు మారిసా చెప్పారు. ఈ ఘటన డిసెంబర్ 19న జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐస్‌ల్యాండ్ విమాన సిబ్బందిని ప్రశంసిస్తూ టిక్‌టాక్‌లో ఆమె ఓ వీడియోను పోస్ట్ చేయడంతో అసలు విషయం బయటపడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook