China passes new land border law amid military standoff with India: చైనా మరో ఎత్తుగడ వేసింది. సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రత పేరుతో కొత్త సరిహద్దు చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చుకుంది. సరిహద్దుల్లో చైనా (China) ప్రజలు నివసించేలా, పని చేసుకునేలా ప్రోత్సహించనున్నట్లు ఆ చట్టంలో చైనా వెల్లడించింది. మౌలిక సదుపాయాల కల్పనలతో పాటు సరిహద్దు రక్షణ.. ఆర్థిక, సామాజిక అభివృద్ధి కోసం పాటుపడనున్నట్లు ఈ చట్టంలో తెలిపింది.
Also Read : India vs Pakistan LIVE Score Card: భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లైవ్ స్కోర్ అప్డేట్
ఇక సరిహద్దులు, ప్రాదేశిక సమగ్రతకు వ్యతిరేకంగా చేపట్టే పనులను అడ్డుకునేందుకు చైనా ఎలాంటి చర్యలైనా చేపట్టడానికి సిద్ధపడుతుందని చట్టంలో పేర్కొంది. చైనా తీసుకొచ్చిన తాజా చట్టం (China new land border law) భారత్‌తో సరిహద్దు వివాదంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ చట్టం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమలులోకి రానుంది. ఇక చర్చలతోనే పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించుకుంటామని వెల్లడించింది. అయితే 12 పొరుగు దేశాలతో చైనా సరిహద్దును నిర్ణయించుకున్నప్పటికీ.. భారత్, (India) భూటాన్‌తో (Bhutan) మాత్రం చైనాకు సరైన సరిహద్దు లేదు. దీంతో భారత్, భూటాన్ దేశాలతో చైనా (China) ఎప్పటినుంచో సరిహద్దు వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.
Also Read : T20 World Cup IND vs PAK: రాహుల్, ధోనిలను బతిమలాడిన పాక్ అభిమానులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి