Corona New Wave: ప్రపంచవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. రోజు రోజుకు కొత్త కేసులు బయట పడుతున్నాయి. మరికొన్ని దేశాల్లో వైరస్ కొత్త పుంతలు తొక్కుతోంది. మొన్నటివరకు ఉత్తర కొరియాలో టెర్రర్ పుట్టించిన కోవిడ్..తాజాగా ఫ్రాన్స్‌లో దజ పుట్టిస్తోంది. దీంతో కొత్త వేవ్‌లు రానున్నాయా అన్న భయాందోళనలు కల్గుతున్నాయి. ఈక్రమంలో ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశంలో కొత్త వేవ్ వచ్చిందని..అందుకే రోజువారి కేసులు రెట్టింపు అవుతున్నాయని వెల్లడించారు.
ఫ్రాన్స్‌లో గత కొంతకాలంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. ఆ దేశంలో ఒక్కరోజే 50 వేలకు పైగా కేసులు బయట పడ్డాయి. కొత్త కేసులు దాదాపు రెండు నెలల గరిష్ఠ స్థాయికి చేరాయి. ఈనేపథ్యంలో ఫ్రాన్స్ వ్యాక్సినేషన్ చీఫ్ అలైన్ ఫిషర్ ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే..మరో వేవ్ వచ్చినట్లు ఉందన్నారు. తాము కొత్త వైరస్‌తో బాధపడుతున్నామని..ఐతే దాని తీవ్రత ఎంత వరకు ఉంటుందన్న దానిపై క్లారిటీ లేదని చెప్పారు.
ఐతే దేశ ప్రజలంతా అలర్ట్‌గా ఉండాలని..ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. ప్రజా రవాణాలో మాస్క్ తప్పనిసరి చేయాలన్నారు. ఫ్రాన్స్‌లో గత నెల చివరి వారం నుంచి కొత్త కేసులు బయటపడుతున్నాయి. ఏడు రోజుల వ్యవధిలో రోజువారి కేసులు మూడు రేట్లు పెరిగాయి. గతనెల 27న 17 వేల 705 కేసులు నమోదు అయ్యాయి. తాజాగా 50 వేల 402 మందిలో వైరస్ బయట పడింది. ఇటు పోర్చుగల్‌లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
ఒమిక్రాన్ వేరియంట్లు బీఏ.4, బీఏ.5 వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని వల్లే కేసులు అధికంగా నమోదు అవుతున్నాయని అక్కడి శాస్త్రవేత్తలు, వైద్యులు వెల్లడించారు. ఐతే వైరస్ బారిన పడిన వారిలో ఎలాంటి లక్షణాలు లేవని గుర్తించారు.
Also read:Amma Vodi Scheme in AP: ఈసారి అమ్మ ఒడి పథకంలో కోత తప్పదా..ప్రభుత్వ వాదన ఏంటి..?
Also read:Maharashtra Political Crisis: కొనసాగుతున్న 'మహా' డ్రామా..ఏక్‌నాథ్ శిందే వైపు ఎమ్మెల్యేల క్యూ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook