ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబుకు గౌరవం ;  ఇండియన్ ఐకానిక్ లీడర్ అంటూ ప్రసంశలు

                                       

Last Updated : Sep 25, 2018, 04:57 PM IST
ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబుకు గౌరవం ;  ఇండియన్ ఐకానిక్ లీడర్ అంటూ ప్రసంశలు

ఐక్యరాజ్యసమితిలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఊహించని గౌరవం లభించింది. 'సుస్థిర సేద్యానికి ఆర్థిక చేయూత...అంతర్జాతీయ సవాళ్లు- అవకాశాలు' అనే అంశంపై జరిగిన చర్చలో పాల్గోనేందుకు భారత ప్రతినిధిగా వెళ్లిన చంద్రబాబుకు ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు చాలా గొప్పగా పరిచయం చేశారు.

ఐసారా సభలో ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మాట్లాడుతూ " లేడీస్ అండ్ జెంటిల్మన్ అండ్ ఎక్సలెన్సీస్..  ఈ రోజు ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విజేతలు మనతో పాటు ఉన్నారు...ఇండియాలోని ఏపీ సీఎం చంద్రబాబు మనతో ఉన్నారు. ఐటీ గురించి మాట్లాడాల్సి వస్తే భారత్ లో చంద్రబాబు ఒక ఐకానిక్ లీడర్... ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులే. భారత్ లోని ప్రతి నలుగురు ఐటీ ఎక్స్ పర్ట్స్ లో ఒకరు చంద్రబాబు రాష్ట్రానికి చెందినవారే. 

ఇంకా ఏమన్నారంటే ....
ఐక్యరాజ్యసమితి ప్రతినిధి మాట్లాడుతూ... వాస్తవానికి ఇండియా జనాభాలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా కేవలం నాలుగు శాతం మాత్రమే... అయినా దేశ ఐటీ నిపుణుల్లో 25 శాతం మంది ఆయన రాష్ట్రారికే చెందిన వారే కావడం గమనార్హం... ఐటీ రంగంలో ఆయన ఎంతగా ప్రగతి సాధించారని చెప్పడానికి ఇదే నిదర్శనం... చంద్రబాబు ఉద్దేశించి మాట్లాడుతూ.. చంద్రబాబు గారు మీ లీడర్ షిప్ కు..ఛాంపియన్ షిప్ కు ధన్యవాదాలు... మీరు మీ రాష్ట్రంతో  పాటు దేశ అభివృద్ధి కోసం మీరు చాలా చేస్తున్నారు... మీరు.. ఏపీ, ఇండియా... వీలైతే ప్రపంచ భవిష్యత్తును మార్చగలరు. మీరు చేస్తున్నది వినాలనుకుంటున్నాం. మీరు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు"... అంటూ చంద్రబాబును ఐక్యరాజ్యసమితి మోడరేటర్ సభకు పరిచయం చేశారు. ఈ సందర్భగా ఈ విధంగా పరిచయం చేస్తున్నప్పుడు... సభాప్రాంగణం చప్పట్లతో  మార్మోగింది.

సభ ప్రతినిధుల ఆహ్వానం మేరకు ఐక్యరాజ్యసమితిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకోపన్యాసం చేశారు. తొలుత సీఎం తెలుగులో మాట్లాడటంతో సభికుల నుంచి హర్షధ్వానాలు వెల్లువెత్తాయి. తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ఎరువులు, పురుగుల మందు వాడకుండా వ్యవసాయం చేయడం సాధ్యమేనని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంతో ఏపీ ప్రపంచానికే ఆదర్శంగా మారిందన్నారు. రాష్ట్రంలో ప్రకృతి సేద్యం అమలుతీరును వివరించారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయానికి సాంకేతికత, మేథో పరిజ్ఞానాన్ని జోడించేందుకు పరస్పర సహాయ సహకారాలపై చంద్రబాబు ప్రసంగించారు.

 

Trending News