NeoCov Virus: నియోకోవ్ అన్ని కరోనా వేరియంట్స్ కంటే ప్రాణాంతకమా?.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?

దక్షిణాఫ్రికాలో 'నియో కోవ్‌' అనే కొత్త రకం కరోనా వైరస్​ వేరియంట్‌ బయటపడినట్లు వుహాన్​ శాస్త్రవేత్తలు వెల్లడించారు. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని అంచనా వేశారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2022, 04:59 PM IST
  • మరో బాంబు పేల్చిన వుహాన్​ శాస్త్రవేత్తలు
  • వెలుగులోకి కరోనా కొత్త వేరియంట్‌ నియో కోవ్‌
  • వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు
NeoCov Virus: నియోకోవ్ అన్ని కరోనా వేరియంట్స్ కంటే ప్రాణాంతకమా?.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే?

Neocov Variant deadliest than all Covid Strains: ప్రపంచమంతా ప్రస్తుతం కరోనా వైరస్ (Coronavirus) వేరియంట్‌ 'ఒమిక్రాన్'తో సతమతమవుతుంటే.. చైనాలోని వుహాన్​ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు (Wuhan Scientists) మరో బాంబు పేల్చారు. దక్షిణాఫ్రికాలో 'నియో కోవ్‌' (NeoCoV) అనే కొత్త రకం వేరియంట్‌ బయటపడినట్లు వెల్లడించారు. నియో కోవ్‌ వేరియంట్‌ కరోనా వైరస్​ అన్ని వేరియంట్స్ కంటే ప్రమాదం అని,​ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుందని హెచ్చరించారు. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.

'దక్షిణాఫ్రికాలో నియో కోవ్‌ వేరియంట్‌ బయటపడింది. ఇది కరోనా వైరస్​ అన్ని వేరియంట్స్ కంటే చాలా ప్రమాదం. ఇందులో అధిక మ్యూటేషన్స్ ఉన్నందున వేగంగా వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన ప్రతి ముగ్గురిలో ఒకరు చనిపోయే ముప్పు ఉంది. ఈ వైరస్ వల్ల వచ్చే అంటువ్యాధుల నుంచి మనుషులను రక్షించడానికి ప్రస్తుత కరోనా టీకాలు సరిపోవు. నియో కోవ్‌ యాంటిజెనిక్ డ్రిఫ్ట్ ద్వారా మరింత పరివర్తన చెంది మనుషులకు సోకే అవకాశం ఉంది' అని బయోఆర్క్సివ్ వెబ్‌సైట్‌లో ఓ కథనం ప్రచురించబడింది. 

Also Read: Australian Open - Rafael Nadal: ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ఫైనల్లో నాదల్.. చరిత్రకు అడుగు దూరంలో స్పెయిన్‌ దిగ్గజం!!

నియో కొవ్ వైరస్ కొత్తదేమీ కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. 2012, 2015లో పశ్చిమ ఆసియాలో వ్యాపించిన మెర్స్ కొవ్​కు, నియో కొవ్​కు సంబంధం ఉందని వారు పేర్కొన్నారు. నియో కొవ్​ను తొలుత దక్షిణాఫ్రికాలోని గబ్బిలాల్లో గుర్తించారని, ఇప్పటివరకు మనుషులకు సోకలేదని తెలిపారు. ప్రస్తుతం ఇది జంతువుల నుంచి జంతువులకు మాత్రమే సోకుతుందని స్పష్టం చేశారు. అయితే ఓ మ్యుటేషన్‌ కారణంగా నియో కోవ్ జంతువుల నుంచి మనుషులకు సోకే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. 

నియో కోవ్‌ వైరస్‌కు గబ్బిలాల్లోని యాంజియోటెన్సిన్‌ - కన్వర్టింగ్‌ ఎంజైమ్‌ ప్రభావవంతగా ఉంటుందని వుహాన్‌ శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. దీనితో పోలిస్తే మనుషుల్లోని ACE2ను ఏమార్చి శరీరంలోకి ప్రవేశించే సామర్థ్యం కాస్త తక్కువ ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ అధ్యయనాన్ని ఇంకా పీర్​ రివ్యూ చేయలేదు. దీనిపై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా కొత్త కరోనా వేరియంట్స్ రావడం మాత్రం ఖాయం అని తెలుస్తోంది. 

Also Read: Harish Rao: మంత్రి హరీశ్ రావు ఖమ్మం పర్యటనలో ఉద్రిక్తత... అడ్డుకున్న బీజేపీ శ్రేణులు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News