Next Covid Variant: కోవిడ్ తదుపరి వేరియంట్ జంతువుల నుంచి..? సైంటిస్టుల హెచ్చరిక..

Next Covid Variant : కరోనా వైరస్ తదుపరి వేరియంట్ జంతువుల నుంచి పుట్టుకురానుందా.. ఇందుకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. జంతువుల నుంచి కోవిడ్ తదుపరి వేరియంట్ పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 5, 2022, 10:12 AM IST
  • కరోనా తదుపరి వేరియంట్‌పై సైంటిస్టుల హెచ్చరిక
  • మనుషుల నుంచి కాకుండా జంతువుల నుంచి పుట్టుకొచ్చే ప్రమాదం
  • ఇప్పటికే పలు జంతువుల్లో కరోనా ఆనవాళ్లు
Next Covid Variant: కోవిడ్ తదుపరి వేరియంట్ జంతువుల నుంచి..? సైంటిస్టుల హెచ్చరిక..

Next Covid Variant : గత మూడేళ్లుగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు ఆ మహమ్మారి బారి నుంచి బయటపడుతున్నాయి. అయితే ఎప్పుడు ఏ కొత్త వేరియంట్ విరుచుకుపడుతుందోనన్న భయాందోళనలు ఇప్పటికీ ఉన్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్‌కు సంబంధించి తాజాగా పరిశోధకులు వెల్లడించిన ఓ విషయం ప్రపంచ దేశాలను మళ్లీ కలవరపాటుకు గురిచేస్తోంది. 

కోవిడ్ తదుపరి వేరియంట్ జంతువుల నుంచి పుట్టుకొచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్‌ స్వభావాన్ని అర్థం చేసుకునేందుకు పరిశోధకులు జరుపుతున్న అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. కరోనా వైరస్ ఇప్పటికే మింక్స్, చిట్టెలుకలకు కూడా సోకినట్లు పరిశోధకులు గుర్తించారు. ఎన్నో జంతుజాలాల్లో వందల, వేల కరోనా వైరస్‌లు ఇప్పటికే ఉన్నాయని అమెరికాకు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ ప్రతినిధి డా.జెఫ్ టౌబెన్‌బెర్గర్ వెల్లడించారు.

ఉత్తర అమెరికా అడవుల్లో కనిపించే తెల్ల తోక జింకల్లోనూ కరోనా వైరస్‌ను పరిశోధకులు గుర్తించారు. వైరస్ ఇలా జంతువుల్లో అంతకంతకూ విస్తరిస్తున్నందునా కొత్త వేరియంట్స్ పుట్టుకురావొచ్చునని.. తిరిగి అది మళ్లీ మనుషులను చేరితే అత్యంత ప్రమాదకరమని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటివరకూ మనం చూసిన వేరియంట్స్ కంటే ఆ కొత్త వేరియంట్ పూర్తి భిన్నంగా ఉండొచ్చునని చెబుతున్నారు.

ఇలా జంతువుల నుంచి పుట్టుకొచ్చే కరోనా వేరియంట్లకు కళ్లెం వేయాలంటే యూనివర్సల్ వ్యాక్సిన్‌తోనే సాధ్యమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాల్టర్ రీడ్ ఆర్మీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్‌కి చెందిన సైంటిస్టుల బృందం ప్రస్తుతం యూనివర్సల్ వ్యాక్సిన్‌ను అభివృద్ది చేసే పనిలో నిమగ్నమయ్యారు. 

Also Read: MS Dhoni: బస్సు డ్రైవర్‌గా మారిన ఎంఎస్ ధోనీ.. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించి మరీ దూసుకెళ్లాడు (వీడియో)!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News