Pakistan's telecom regulator has lifted ban on TikTok: చైనాకు చెందిన పాపులర్ షార్ట్ వీడియో యాప్ 'టిక్ టాక్'పై నిషేధం (Tik Tok Ban) ఎత్తివేసింది పాకిస్థాన్. పాకిస్థాన్ టిక్టాన్ను బ్యాన్ చేయడం, దానిని ఎత్తివేయడం ఇది నాలుగో సారి.
అశ్లీల, అనైతిక కంటెంట్‌ను నియంత్రిస్తామని హామీ ఇవ్వడంతో పాకిస్థాన్ టెలికాం నియంత్రణ సంస్థ (పీటీఏ) తాజాగా టిక్ టాక్‌పై నిషేధం (Pak Lifetd Ban on Tik Tok) ఎత్తివేసింది.
జులై 20న బ్యాన్..
పీటీఏ వెల్లడించిన వివరాల ప్రకారం.. అనుచిత కంటెంట్‌పై నియంత్రణ లేదని కారణంతో జులై 20న టిక్‌టాక్‌పై నిషేధం విధించింది పాకిస్థాన్. అప్పటి నుంచి ఈ విషయంపై టిక్‌టాక్ యాజమాన్యం ప్రభుత్వంతో చర్చలు జరపగా.. తాజాగా దీనిపై ఓ అహగాహనకు వచ్చినట్లకు తెలిసింది.
Also read: సంచలనం: మహిళతో సెక్స్ చాటింగ్.. ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేసిన పైన్!
టిక్‌టాక్‌లో "చట్టవిరుద్ధమైన కంటెంట్"ని అప్లోడ్ చేయడంలో నిరంతరం ప్రమేయం ఉన్నందుకు సోషల్ మీడియా కంపెనీ వినియోగదారులను బ్లాక్ చేస్తామని కూడా టిక్ టాక్ హామీ ఇచ్చిందని తెలిపింది పీటీఏ.
టిక్‌టాక్ ఇచ్చిన హామీలను దృష్టిలో ఉంచుకుని వెంటనే నిషేధం ఎత్తివేతకు ఆదేశించినట్లు పేర్కొంది నియంత్రణ సంస్థ. అయితే టిక్‌టాక్‌పై పర్యవేక్షణ మాత్రం (Pak on Tik tok) కొనసాగుతుందని స్పష్టం చేసింది.
Also read: పాకిస్తాన్ మహిళా ఎమ్మెల్యే అశ్లీల వీడియో లీక్... సోషల్ మీడియాలో వైరల్... పోలీసులకు ఫిర్యాదు
భారత్‌లో 2020 నుంచి బ్యాన్..
భారతదేశ సార్వభౌమాధికారం, సమగ్రత, భద్రతలకు హాని కలిగిస్తున్నాయి అనే ఆరోపణతో టిక్‌టాక్ సహా.. 59 చైనా యాప్‌లపై గత ఏడాది జూన్ 29న నిషేధం విధించింది ప్రభుత్వం. తిరిగి భారత్‌లో కార్యకలపాలు ప్రారంభించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్. అయితే ఆ ప్రయత్నాలేవి సఫలం కాలేదు. దీనితో టీక్‌టాక్ కార్యకలాపాలు భారత్‌లో (Tik Tok life Time Ban in India) పూర్తిగా నిలిచిపోయాయి.
Also read: అమెరికాలో 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు బూస్టర్ డోసుకు అర్హులే!
Also read: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా కమలా హారిస్ రికార్డు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook