Pakistan Protest Against Imran: ఇమ్రాన్​ ఖాన్​కు వ్యతిరేకంగా ఆందోళనలు.. రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాల డిమాండ్​

Pakistan Protest Against Imran: పాకిస్థాన్​ ప్రధానమంత్రికి వ్యతిరేకంగా ఆ దేశంలోని ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్‌ ధరలు భారీగా పెరిగాయని ఇమ్రాన్‌ఖాన్‌ తక్షణం రాజీనామా చేయాలని నిరసన కారులతో పాటు ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 24, 2021, 04:27 PM IST
    • ఇమ్రాన్​ ఖాన్​కు వ్యతిరేకంగా పాకిస్థాన్​లో నిరసనలు
    • దేశంలో నిరుద్యోగం, నిత్యావసర సరకుల రేట్లు పెరిగిపోవడమే కారణం
    • ఆందోళనల్లో ఇద్దరు పోలీసులు మృతి
Pakistan Protest Against Imran: ఇమ్రాన్​ ఖాన్​కు వ్యతిరేకంగా ఆందోళనలు.. రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాల డిమాండ్​

Pakistan Protest Against Imran: పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రభుత్వానికి (Imran Khan Government) వ్యతిరేకంగా ఆ దేశ ప్రజలు నిరసనలు చేపట్టారు. వేలాది మంది ప్రజలు కరాచీ వీధుల్లో కదం తొక్కారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు వేలాది మంది ఈ ఆందోళనలకు మద్దతుగా నిలిచారు. నిరుద్యోగులు పెరిగి పోవడం (Unemployment Rate in Pakistan) సహా నిత్యావసరాలు, గ్యాస్, విద్యుత్‌ ధరలు భారీగా పెరిగాయని ఇమ్రాన్‌ఖాన్‌ తక్షణం రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. 

తమ దేశ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వందలాది మంది కార్మికులు ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. తమ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు వ్యతిరేకంగా రాసిన బ్యానర్లను కార్మికులు ప్రదర్శించారు. దేశంలోని పేదలకు రోజుకు రెండు పూటలా భోజనం కూడా లభించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాని పదవికి ఇమ్రాన్‌ అనర్హుడని జమియత్ ఉలేమా ఇ ఇస్లాం సంస్థ నేత రషీద్ సూమ్రో అన్నారు. దేశాన్ని ఎలా నడపాలో ఇమ్రాన్‌కు తెలియదని.. ఆయన తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

పోలీసులు మృతి

ఈ నిరసనలలో భాగంగా లాహోర్‌లో భద్రతా దళాలు, ప్రజల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో ఇద్దరు పోలీసులను నిరసనకారులు హత్య చేయగా.. అనేక మంది ఆందోళన కారులు గాయపడ్డారు. గత ఏడాది ఫ్రాన్స్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో అరెస్ట్‌ చేసిన తమ నేతను విడుదల చేయాలన్న డిమాండ్‌తో నిరసనకారులు ఇస్లామాబాద్‌కు లాంగ్‌ మార్చ్‌ నిర్వహిస్తున్నారు. 
లాహోర్‌ నుంచి ఇస్లామాబాద్ (Protest In Pakistan) వైపు వెళ్తున్న వారిని భద్రతా దళాలు అడ్డుకోవడం వల్ల ఈ ఘర్షణ చెలరేగింది. ఆందోళనకారులపై పోలీసులు బాష్ప వాయుగోళాలు ప్రయోగించారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించేందుకు కూడా పోలీసులు అనుమతించకపోవడం వల్ల నిరసనకారులు దాడికి దిగారు. ఈ దాడుల్లో ఇద్దరు పోలీసు అధికారులు మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. నిరసనకారులు ఇస్లామాబాద్‌లోకి ప్రవేశించకుండా ఉండేందుకు రహదారులను దిగ్బంధించారు.   

టీ20 ప్రపంచకప్​లో భారత్​, పాక్​ ఢీ 

ICC T20 World Cup 2021లో అందరూ ఎదురు చూస్తున్న ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్(India-Pakistan Match)ఇవాళ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. దాయాదుల మధ్య పోరు కావడం వల్ల అత్యంత ఆసక్తి నెలకొంది. దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో, బహిరంగ ప్రదేశాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాటయ్యాయి. మరోవైపు టాస్ నుంచి ప్రతి అంశం వరకూ ఇండియా - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్ ఊపందుకుంటోంది. ఇవాళ్టి మ్యాచ్‌పై దాదాపు 2 వేల కోట్ల వరకూ బెట్టింగ్ జరగవచ్చని అంచనా. ప్రపంచ కప్ వేదికల్లో తిరుగులేని ఇండియా..మరోసారి పాకిస్థాన్‌ను ఓడించేందుకు సిద్ధమౌతోంది. టీ20 ప్రపంచకప్ (T20 World Cup) మ్యాచ్‌లో ఆరోసారి గెలిచేందుకు ఇండియా సంసిద్ధంగా ఉండగా..ఈసారైనా గెలవాలనే నిశ్చయంతో పాకిస్థాన్ ఉంది. తొలి మ్యాచ్‌ను ప్రత్యర్ధి దేశంపై గెలిచి..స్ఫూర్తి నింపాలనే ఆలోచనలో కోహ్లీ సేన ఉంది. 

Also Read: Shoaib Akhtar Comments: భారత ఆటగాళ్లకు నిద్ర మాత్రలు ఇవ్వాలి.. విరాట్ ఇన్‌స్టాకు దూరంగా ఉండాలి!

Also Read: India vs Pakistan: 'మేము ప్రొఫెషనల్స్': విరాట్ Vs 'గతం గతహా': బాబర్.. Press Meet 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.

Trending News