Nuclear War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం..అణుయుద్ధంగా మారనుందా, ఏం జరగనుంది

Nuclear War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముదిరేకొద్దీ ప్రపంచ దేశాలకు కొత్త భయం చుట్టుకుంటోంది. అగ్రరాజ్యాల దృష్టి అణ్వాయుధాలపై పడటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆ కారణాలేంటో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 22, 2022, 09:24 AM IST
  • నెలరోజులవుతున్నా ఆగని రష్యా ఉక్రెయిన్ యుద్ధం
  • యూకే, బ్రిటన్, నాటో దేశాల అణ్వస్త్రాల ప్రయత్నాలు
  • ప్రపంచదేశాల్ని భయపెడుతున్న అణు యుద్ధం ముప్పు
Nuclear War: రష్యా ఉక్రెయిన్ యుద్ధం..అణుయుద్ధంగా మారనుందా, ఏం జరగనుంది

Nuclear War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముదిరేకొద్దీ ప్రపంచ దేశాలకు కొత్త భయం చుట్టుకుంటోంది. అగ్రరాజ్యాల దృష్టి అణ్వాయుధాలపై పడటమే దీనికి కారణంగా తెలుస్తోంది. ఆ కారణాలేంటో పరిశీలిద్దాం..

ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రారంభమై అప్పుడే నెలరోజులు కావస్తున్నాయి. యుద్ధం ఇప్పట్లో అగే పరిస్థితి కన్పించడం లేదు. యుద్ధం ప్రారంభమై నెలరోజులవుతున్నా..ఉక్రెయిన్ నుంచి ఇంకా ప్రతిఘటన ఎదురవుతూనే ఉంది. ఈ క్రమంలో రష్యా అణ్వాయుధాల బెదిరింపులకు పాల్పడవచ్చని అమెరికా రక్షణ వ్యవస్థ పెంటగాన్ హెచ్చరించింది. ఈ యుద్ధంలో ఇప్పటికే హైపర్ సోనిక్ క్షిపణుల్ని వినియోగించింది. పరిస్థితులు తప్పనిసరిగా మారితే..అణ్వాయుధాలు కూడా వాడవచ్చనేది ఆందోళనగా ఉంది. 

ఉక్రెయిన్ దేశంపై యుద్ధానికి దిగిన ప్రారంభంలోనే..అణ్వాయుధ దాడులకు సిద్ధంగా ఉండాలనేది రష్యా అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే హెచ్చరించారు. నాటో దేశాలకు ఈ భయం వెంటాడుతోంది. అదే సమయంలో యూకే ట్రైడెంట్ ఖండాంతర క్షిపణులకు అమర్చే..అణు వార్ హెడ్స్‌ను ట్రక్కుల ద్వారా కీలక ప్రాంతాలకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. అటు నాటో దేశాలు కూడా యూకేలోని వార్ హెడ్స్‌ను బ్రిటన్ ట్రైడెంట్ క్షిపణులకు అమర్చి ప్రయోగించే అవకాశాలున్నాయి. అటు పుతిన్ హెచ్చరికలు, యూకే వార్ హెడ్స్‌ను బయటకు తీయడమనేది ప్రపంచదేశాలకు ఆందోళన కల్గించేదిగా మారింది. 

మరోవైపు అణ్వాయుధ దాడి జరిగితే..అవలంభించాల్సిన విధానాలపై కసరత్తు చేయాలని పుతిన్ సైన్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకోవైపు రష్యా తన దాడుల వ్యూహం కూడా మార్చింది. ఇప్పటివరకూ తూర్పు ఉక్రెయిన్ ప్రాంతంలో దాడులు నిర్వహించిన రష్యా..పోలండ్ సరిహద్దు నగరాలపై కూడా దాడులు చేస్తోంది. అటు యూకే , రష్యా, నాటో దేశాల దృష్టి అంతా అణ్వాయుధాలపై పడటంతో ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్నాయి. అణుయుద్ధంగా మారితే ఆ రెండు దేశాలే కాకుండా చుట్టుపక్కల దేశాలు కూడా దుష్పరిణామాలు ఎదుర్కోవల్సి వస్తుంది. 

Also read: China Flight Crash: చైనా విమాన ప్రమాదంలో ఎవరూ బతకలేదా..కొండపై చెలరేగుతున్న మంటలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News