Russia Ukraine War: ఉక్రెయిన్‌ని తక్షణమే ఈయూలో చేర్చుకోండి.. అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి

Russia Ukraine War Updates: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో తక్షణమే తమను యూరోపియన్ యూనియన్‌లో చేర్చుకోవాలని జెలెన్‌స్కీ ఈయూకి విజ్ఞప్తి చేశారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2022, 08:18 PM IST
  • ఈయూకి ఉక్రెయిన్ అధ్యక్షుడి కీలక విజ్ఞప్తి
  • యూరోపియన్ యూనియన్‌లో చేర్చుకోవాలన్న జెలెన్‌స్కీ
  • తక్షణమే చేర్చుకోవాలని కోరి అధ్యక్షుడు
Russia Ukraine War: ఉక్రెయిన్‌ని తక్షణమే ఈయూలో చేర్చుకోండి.. అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి

Russia Ukraine War Updates: ఉక్రెయిన్‌ని తక్షణమే యూరోపియన్ యూనియన్‌లో చేర్చుకోవాలని ఆ దేశాధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ ఈయూకి విజ్ఞప్తి చేశారు. ఇది సరైనదేనని.. అందుకు తాము అర్హులమేనని.. ఇది సాధ్యపడుతుందని పేర్కొన్నారు. ప్రత్యేక విధానం ద్వారా తమను ఈయూలో చేర్చుకోవాలన్నారు. ఇకనైనా రష్యా సైనికులు ఆయుధాలు విడిచి ఉక్రెయిన్‌ని వీడాలని.. తద్వారా ప్రాణాలు కాపాడుకోవాలని జెలెన్‌స్కీ పేర్కొన్నారు.  ఈ మేరకు జెలెన్‌స్కీ ఓ వీడియో ప్రకటన విడుదల చేశారు.

ఉక్రెయిన్ అధ్యక్షుడి విజ్ఞప్తిపై ఈయూ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఉక్రెయిన్ అధ్యక్షుడు ప్రతిపాదించిన ఆ ప్రత్యేక విధానం ఏమిటనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఇంత త్వరితగితన ఉక్రెయిన్‌ని ఈయూలో చేర్చుకోవడంపై యూరోపియన్ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది. రష్యాతో యుద్ధానికి ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ ఉక్రెయిన్‌కి పూర్తి సహాయ సహకారాలు అందిస్తోంది. అవసరమైతే మున్ముందు ఫైటర్ జెట్స్‌ను కూడా పంపించేందుకు సిద్ధమవుతున్నాయి. అదే సమయంలో రష్యాపై పలు ఆంక్షలు విధించాయి.

మరోవైపు, యుద్ధం కారణంగా ఇప్పటివరకూ 5 వేల పైచిలుకు మంది రష్యన్ సైనికులు చనిపోయినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 191 యుద్ధ ట్యాంకులు, 29 ఫైటర్ జెట్స్, 29 హెలికాప్టర్స్, 816 సాయుధ సిబ్బంది క్యారియర్లను ఉక్రెయిన్ బలగాలు ధ్వంసం చేసినట్లు తెలిపింది. ప్రస్తుతం బెలారస్ వేదికగా రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. రెండు దేశాలు తమ తమ డిమాండ్లను ముందుకు తెస్తున్నాయి. చర్చలు సఫలమవుతాయా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఓవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ.. మరోవైపు రష్యా దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఇవాళ్టితో రష్యా-ఉక్రెయిన్ యుద్దం ఐదో రోజుకు చేరింది. 
 

Also Read: Asus 8z Launched: ఇండియాలో లాంచ్ అయిన ఆసస్ 8 జెడ్ స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్ ఇవే..

Also read: Flipkart Electronics Sale: ఫ్లిప్​కార్ట్ సూపర్​ ఆఫర్​- రూ.14,999కే వన్​ప్లస్ స్మార్ట్​ టీవీ!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News