Indians kidnapped in Libya: కిడ్నాప్ అయిన ఏపీవాసులు సహా ఏడుగురు భారతీయులు విడుదల

లిబియాలో కిడ్నాప్ అయిన ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు మొత్తం ఏడుగురు భారతీయులు చెర నుంచి (Indians kidnapped in Libya released) విడుదలయ్యారు.  లిబియాలోని అశ్వెరీఫ్ అనే ప్రాంతంలో సెప్టెంబర్ 14న ఏపీ, బిహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏడుగురు అపహరణకు గురయ్యారు.

Last Updated : Oct 12, 2020, 09:43 AM IST
Indians kidnapped in Libya: కిడ్నాప్ అయిన ఏపీవాసులు సహా ఏడుగురు భారతీయులు విడుదల

లిబియాలో కిడ్నాప్ అయిన ఆంధ్రప్రదేశ్ వాసులతో పాటు మొత్తం ఏడుగురు భారతీయులు చెర నుంచి విడుదలయ్యారు (Indians kidnapped in Libya released). ఈ మేరకు ట్యూనీషియాలోని భారత రాయబారి పునీత్ రాయ్ కుందల్ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. లిబియాలోని అశ్వెరీఫ్ అనే ప్రాంతంలో సెప్టెంబర్ 14న ఏపీ, బిహార్, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఏడుగురు అపహరణకు గురయ్యారు (కిడ్నాప్ అయ్యారు).

వాస్తవానికి లిబియాలో అంతర్యుద్ధం, దేశ పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, అక్కడికి వెళ్లకూడదని భారత విదేశాంగశాఖ 2015 నుంచి హెచ్చరిస్తోంది. అయినా లిబియాకు వెళ్తున్నందున ప్రయాణాలపై నిషేధం సైతం విధించింది. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు లిబియాకు వెళ్లి కిడ్నాప్ అయ్యారు. భారత విదేశాంగశాఖ చొరవ తీసుకుని వారిని సురక్షితంగా విడుదలయ్యేలా చేసింది. కిడ్నాప్ అయిన ఏడుగురు కార్మికులు సురక్షితంగా విడుదల అయ్యారని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News