అమెరికాలోని మిస్సోరి యునివర్సిటీలో ఎంఎస్ చదువుతున్న వరంగల్ విద్యార్థి శరత్ కొప్పుల(26) పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. మిస్సోరిలోని కేన్సన్ సిటీ రెస్టారెంట్ లో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. కన్సాస్ నగరంలో ఓ రెస్టారెంటులో శుక్రవారం సాయంత్రం దుండగులు ఐదు రౌండ్లు కాల్పులు జరపడంతో వరంగల్‌కు చెందిన శరత్ కొప్పుల (26) తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే పోలీసులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. కాల్పులకు గల కారణాలు అధికారికంగా తెలియరాలేదు. అనుమానితులెవరినీ పోలీసులు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు.
కాల్పుల సమయంలో శరత్ తో పాటు మరికొంత మంది స్నేహితులు కూడా ఉన్నారు. కాల్పుల్లో శరత్ భుజంలోకి బుల్లెట్ దిగినట్లు, తీవ్రంగా గాయపడినట్లు స్నేహితులు ద్వారా తల్లిదండ్రులు సమాచారం అందింది. దీంతో శరత్ తల్లిదండ్రులు ఆందోళన చెంది తెలంగాణ డీజీపీని కలిశారు. శరత్ చనిపోయినట్లు శనివారం రాత్రి తెలంగాణ పోలీసులు తెలిపారని శరత్ కుటుంబ సభ్యులు తెలిపారు. బీటెక్ పూర్తి చేసిన శరత్ ఉన్నత చదువుల నిమిత్తం ఈ ఏడాది జనవరిలో అమెరికాకు వెళ్లాడు. శరత్ మృతితో ఆయన కుటుంబంలో విషాదం అలముకుంది.
Sharath Koppu,26-year-old boy from Telangana who was studying in United States killed after unknown people opened fired in Missouri's Kansas City. Relative says,'he left for USA in Jan 2018. Unknown people open fired in Kansas City. He got injured & succumbed to injuries'(7.7.18) pic.twitter.com/NRk5WhaisL
— ANI (@ANI) July 7, 2018
బిల్లు అడిగాడనే కాల్చారా?: కాల్పులు ఎవరు జరిపారు? ఎందుకు కాల్చారు? అనే విషయం తెలియలేదని శరత్ బంధువులు తెలిపారు. స్థానిక మీడియా కథనాల సమాచారం ప్రకారం, శుక్రవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో హోటల్‌లోని క్యాష్‌కౌంటర్‌లో శరత్ విధుల్లో ఉన్నాడు. గుర్తుతెలియని ఓ వ్యక్తి వచ్చి ఆహారం ఆర్డర్ చేశాడు. బిల్లు 30 డాలర్లు అయిందని చెప్పగా, ఆ దుండగుడు తుపాకీ తీసి శరత్‌పై కాల్పులు జరిపినట్లు తెలిసింది. ఈ ఘటనలో శరత్ తీవ్ర గాయాలపాలవడంతో పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు. కన్సాస్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. శరత్‌పై కాల్పులు ఎవరు జరిపారో సమాచారం అందిస్తే, వారికి 10వేల డాలర్లు రివార్డు ప్రకటించారు.