Firing In America: అమెరికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపుతున్నాయి. శుక్రవారం అమెరికాలోని వర్జీనియాలో ప్రాథమిక పాఠశాలలో ఆరేళ్ల విద్యార్థి టీచర్‌పై కాల్పులు జరపడం సంచలనం రేకెత్తిస్తోంది. రిచ్‌నెక్ ఎలిమెంటరీ స్కూల్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ఇతర విద్యార్థులెవరూ గాయపడలేదని పోలీసులు అధికారులు తెలిపారు. గాయపడిన టీచర్‌ని హాస్పిటల్‌లో చేర్పించినట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇంకా పూర్తి సమాచారం ఇవ్వాల్సి ఉంది.
ఇది ప్రమాదవశాత్తు జరిగిన కాల్పులు కాదని పోలీసు చీఫ్ స్టీవ్ డ్రూ వెల్లడించారు. కాల్పులకు సంబంధించి మధ్యాహ్నం 2 గంటల సమయంలో తమకు సమాచారం అందిందని చెప్పారు. సమాచారం అందిన వెంటనే తమ బృందం సంఘటనా స్థలానికి చేరుకుందన్నారు. కాల్పులు జరిపిన విద్యార్థి గురించి పోలీసులు ఎలాంటి సమాచారం వెల్లడించలేదు.
ఈ కేసులో స్టూడెంట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వర్జీనియా మేయర్ ఫిలిప్ జోన్స్ మీడియాకు తెలిపారు. ఈ ఘటన తన మనసుకు ఎంతో బాధ కలిగించిందన్నారు. ఇలాంటి సంఘటన నుంచి తాము నేర్చుకుంటామని.. మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ కాల్పుల ఘటన జరిగిన న్యూపోర్ట్ న్యూస్ నగరంలో 1 లక్షా 85 వేలకు పైగా జనాభా ఉంది. ఈ నగరం చీసాపీక్, వర్జీనియా బీచ్ నుంచి 40 మైళ్ల దూరంలో ఉంది. ఈ నగరం యూఎస్ నౌకాదళానికి నౌకానిర్మాణానికి కూడా ప్రసిద్ధి చెందింది.
అమెరికాలో కాల్పుల ఘటన కొత్త విషయం కాదు. ఇలాంటి కేసులు ఇక్కడ నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. గతేడాది 2022లో కాల్పుల్లో వందలాది మంది చనిపోయారు. ఆసుపత్రులు, పబ్బులు, మెట్రో స్టేషన్లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఈ కాల్పుల ఘటనలు జరిగాయి. అమెరికాకు ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. దేశంలో ఆయుధాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని గతంలో అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ స్వయంగా చెప్పారు.
Also Read: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. వసతి గదుల అద్దె భారీగా పెంపు
Also Read: IND Vs SL: శ్రీలంకతో నేడే ఆఖరి ఫైట్.. ఈ మూడు మార్పులతో బరిలోకి టీమిండియా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook