'వర్సిటీ' హోదా కోల్పోయిన విద్యాసంస్థలు

Last Updated : Nov 15, 2017, 01:28 PM IST
'వర్సిటీ' హోదా కోల్పోయిన విద్యాసంస్థలు

ఇటీవల సుప్రీం కోర్టు దూరవిద్యపై తీర్పును వెలువరిస్తూ, యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ (యూజీసీ)కు పలు ఆదేశాలు జారీచేసింది. దీనిపై స్పందించిన యూనివర్సిటీ గ్రాంట్ కమీషన్ (యూజీసీ) భారతదేశంలో ఉన్న 123 యూనివర్సిటీ లకు ఆ హోదాను రద్దు చేసింది. హోదా కోల్పోయిన ఆ విద్యాసంస్థలు తమ విద్యాసంస్థల చివర యూనివర్సిటీ అని పేరు పెట్టుకోరాదు. అయితే, సాధారణ విద్యాసంస్థల మాదిరిగా యధావిధిగా పనిచేస్తాయి. ఇకపై విద్యాసంస్థలన్నీ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తాయి.

యూనివర్సిటీ హోదా కోల్పోయిన విద్యాసంస్థలు (తెలుగు రాష్ట్రాలకు చెందినవి)

* కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్, గుంటూరు 

* రాష్ట్రీయ సంస్కృత విద్యా పీఠం, తిరుపతి

* గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ (గీతం), వైజాగ్

* శ్రీ సత్యసాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్, అనంతపురం

* విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్, గుంటూరు

* వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్)

* ఎస్.ఆర్.ఎమ్. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ

హోదా కోల్పోయిన మరిన్ని విద్యాసంస్థల వివరాల కోసం 'యూజీసీ' వెబ్సైట్ చూడండి.

Trending News