Chief Justice NV Ramana: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి రమణ ఆంధ్రప్రదేశ్ పర్యటన కొనసాగుతోంది. సొంతూరిలో ఘన స్వాగతం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందుతో గౌరవించింది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా భాద్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా తన స్వగ్రామమైన కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం చేరుకున్న జస్టిస్ ఎన్వీ రమణకు(Justice NV Ramana)గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు. జస్టిస్ ఎన్వీ రమణపై పూలవర్షం కురిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వినూత్నంగా సాంప్రదాయ పద్థతిలో ఎడ్లబండి పై ఊరేగింపుతో, మేళ తాళాలతో, కోలాటం నృత్యాలతో జస్టిస్ ఎన్వీ రమణను గ్రామస్థులు తోడ్కొని వెళ్ళారు. ఊరేగింపుకు ముందు నిలిచిన అలంకృత అశ్వాలు అందరిని కనువిందు చేశాయి. దారి పొడుగునా పాఠశాల విద్యార్ధినులు ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తేనీటి విందు ఇచ్చింది. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ (Ap cm ys jagan) దంపతులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఆహ్వానం మేరకు హాజరైన చీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దంపతులు స్వాగతం పలికారు.
Also read: AP Corona cases: రాష్ట్రంలో 24 గంటలల్లో 104 కరోనా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి