UCC Bill: ముస్లింలను నొప్పించేలా ఏ పనీ చేయం, యూసీసీపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత

UCC Bill: యూసీసీ భయం ఇప్పుడు దేశమంతా వ్యాపిస్తోంది. ముఖ్యంగా ముస్లిం ప్రజానీకం యూసీసీపై ఆందోళన చెందుతోంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లింలకు భరోసా ఇస్తున్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 19, 2023, 10:30 PM IST
UCC Bill: ముస్లింలను నొప్పించేలా ఏ పనీ చేయం, యూసీసీపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టత

UCC Bill: యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు విషయంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముస్లింలకు అభయహస్తమిస్తున్నారు. యూసీసీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని..ఈ ప్రభుత్వం బడుగు, మైనార్టీల ప్రభుత్వమని జగన్ స్పష్టం చేశారు. తనను కలిసిన ముస్లిం పెద్దలకు వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. 

కేంద్ర ప్రభుత్వం ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న ఉమ్మడి పౌరస్మృతి అంటే యూనిఫాం సివిల్ కోడ్‌కు వ్యతిరేకంగా మద్దతు కోసం ముస్లిం పెద్దలు ఇవాళ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జగన్‌తో భేటీ అయిన ముస్లిం పెద్దలు యూనిఫాం సివిల్ కోడ్‌పై తమ అభిప్రాయం చెప్పారు. అయితే తమది బడుగు, మైనార్టీల వర్గాల ప్రభుత్వమని..ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అసలు యూసీసీ డ్రాఫ్ట్ ఇంకా రాలేదని, ఎలాంటి అంశాలుంటాయో తెలియదని వైఎస్ జగన్ ముస్లింలకు వివరించారు. కేవలం మీడియాలో చర్చలు చూసి ముస్లింలు ఆందోళన చెందుతున్నారన్నారు. ముస్లిం ఆడబిడ్డల హక్కుల రక్షణ విషయంలో ముస్లిం వర్గమే వ్యతిరేకంగా ఉందనే ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. 

ఏ నియమం లేదా నిబంధనను సాఫీగా ప్రవేశపెట్టాలనుకున్నప్పుడు ఆయా మతాల సంస్థలు, లా బోర్డుల ద్వారా చేయాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ మార్పు అవసరం అనుకుంటే సుప్రీంకోర్చు, లా కమీషన్, కేంద్ర ప్రభుత్వం కలిసి ఆయా మతాల సంస్థలతో చర్చలు జరిపి చేయాల్సి ఉంటుందని జగన్ చెప్పారు. ముస్లింల మనసు నొప్పించే విధంగా తమ ప్రభుత్వం వ్యవహరించదన్నారు జగన్. 

దేశంలో చాలా మతాలు, కులాలు, వర్గాలున్నాయని వారందరికీ విభిన్న ఆచార వ్యవహారాలున్నాయని గుర్తు చేశారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అందరి గ్రంథాలు, విశ్వాసాలను గౌరవించే విధంగా చట్టాల రూపకల్పన ఉండాలన్నారు జగన్. 

Also read: Minister Roja: పవన్‌ మీడియా ముందు హీరో.. రాజకీయాల్లో జీరో: మంత్రి రోజా

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News