ఏపీ ( AP ) ముఖ్యమంత్రిగా తనదైన శైలిలో దూసుకుపోతున్నా...ప్రధానంగా సంక్షేమ పథకాలపైనే పోకస్ పెడుతున్నారు వైఎస్ జగన్ ( Ap cm ys jagan ). ఇప్పుడు ఆ నాలుగు కులాలకు కూడా జగన్ వరమిచ్చేశారు.
ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీల్లో ప్రధానమైంది ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ మహిళలకు ఆర్ధిక సహాయం అందించడం. ముఖ్యమంత్రి కాగానే ఇటీవలే వైఎస్సార్ చేయూత ( ysr cheyutha scheme ) పేరుతో ఈ పథకానికి అంకురార్పణ చేశారు. 45-60 ఏళ్ల వయస్సు కలిగిన ఎస్సీఎస్టీబీసీ మైనార్టీ మహిళలు దీనికి అర్హులు. వాస్తవానికి అధికారంలో వచ్చినప్పటి నుంచీ ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజల్లోకి వెళ్తున్నారు. పాలనపై ప్రధానంగా దృష్టి పెట్టారు. వైఎస్సార్ చేయూత పథకం కింద...ఏడాదికి 18 వేల 750 రూపాయల చొప్పున నాలుగేళ్లలో 75 వేల రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందిస్తారు.
ఇప్పుడీ పథకాన్ని మరో నాలుగు కులాలకు వర్తింపజేయనున్నట్టు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బుడగ జంగం, వాల్మీకి, ఈనేటికోండ్, బెంటో ఒరియా కులాలకు చెందిన వారికి కూడా పథకాన్ని అందించాలని జగన్ సూచించారు. ఈ కులాల్లో అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసి..కుల ధ్రువీకరణ పత్రం లేకపోయినా సరే ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. Also read: AP: మూడు రాజధానులపై వెనక్కి తగ్గేది లేదు; వైఎస్ జగన్