/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

ఇది ఇంటర్వెల్ మాత్రమేనన్న మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలకు ముగింపు ఇచ్చారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ తాత్కాలికమేనన్న విషయం జగన్ తాజా వ్యాఖ్యలతో అర్ధమౌతోంది.

అనూహ్యంగా ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల చట్టం(Ap Three Capitals Bil) రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న అమరావతి రైతులకు ఆ ఆనందం ఎంతోసేపు నిలిచేలా లేదు. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని..సినిమా ఇంకా మిగిలే ఉందని చెబుతూనే పరోక్షంగా ఏదో మతలబు ఉందనే సంకేతాలిచ్చారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి.

ఏపీ మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లును మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి(Buggana Rajendranath)అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. స్పీకర్ అనుమతితో బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితమైతై వేర్పాటు వాదం వస్తుందని శ్రీకృష్ణకమిటీ చెప్పిన సంగతి గుర్తు చేశారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణన్‌ కమిటీ స్పష్టం చేసిందని తెలిపారు. బిల్లుపై చర్చ అనంతరం మూడు రాజధానుల ఉపసంహరణ బిల్లుకు ఏపీ శాసనసభ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతమంటే తనకు వ్యతిరేకత లేదని..తన ఇల్లు ఇక్కడే ఉందని చెప్పారు. అదే సమయంలో త్వరలో సమగ్రమైన పూర్తి వికేంద్రీకరణ బిల్లుతో ముందుకొస్తామని ముఖ్యమంత్రి జగన్(Ap cm ys jagan) ప్రకటించారు. సభ మంగళవారానికి వాయిదా పడింది.

Also read: ఒకే ప్రాంతం అభివృద్ధి చెందితే వచ్చేది వేర్పాటు వాదమే, మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook 

Section: 
English Title: 
Ap cm ys jagan key comments on three capital issue, government soon will introduce comprehensive decentralisation bill
News Source: 
Home Title: 

త్వరలో సమగ్ర వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెడతామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్

త్వరలో సమగ్ర వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెడతామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
Caption: 
Ap cm ys jagan( file photo)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
త్వరలో సమగ్ర వికేంద్రీకరణ బిల్లు ప్రవేశపెడతామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్
Md. Abdul Rehaman
Publish Later: 
No
Publish At: 
Monday, November 22, 2021 - 15:40
Created By: 
Md. Abdul Rehaman
Updated By: 
Md. Abdul Rehaman
Published By: 
Md. Abdul Rehaman
Request Count: 
92
Is Breaking News: 
No