ఆంధ్రప్రదేశ్ ( Andhra pradesh ) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ( ap cm ys jagan ) సాగునీటి ప్రాజెక్టులపై దృష్టి సారించారు. పోలవరం, వెలిగొండ, అవుకు టన్నెల్ -2 పనుల్ని ఆలస్యం లేకుండా..త్వరగా పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టు ( Irrigation Projects ) లపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్..సమీక్ష నిర్వహించారు. వివిధ ప్రాజెక్టుల పురోగతిపై క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ , ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ నారాయణరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. ముందుగా పోలవరం ప్రాజెక్టు పై సమీక్ష చేశారు.
పోలవరం ప్రాజెక్టు ( Polavaram project ) హెడ్ వర్క్స్, కాలువలకు సంబంధించి పనుల్ని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని..నిర్ణీత వ్యవధిలో పాజెక్టు పూర్తవుతుందని స్పష్టం చేశఆరు. ప్రాజెక్టుకు సంబంధించిన అప్రోచ్, స్పిల్ ఛానెల్ పనులు మే వరకూ పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. కాపర్ డ్యాం పనుల్ని అంతకంటే ముందే పూర్తి చేయాలన్నారు. మరోవైపు విశాఖ తాగునీరు అవసరాలు తీర్చేలా పోలవరం నుంచి విశాఖపట్నానికి ప్రత్యేక పైపులైన్ ఏర్పాటుపై పరిశీలన చేయాలని సూచించారు. పంపింగ్ లేకుండా కేవలం గ్రావిటీ ద్వారా నీటిని పంపే ఏర్పాటు చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో వరద నీరు 41.15 అడుగుల స్థాయికి చేరినప్పుడు కూడా బ్యాక్ వాటర్‌తో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ పూర్తి చేసి నిర్వాసితులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు.
మరోవైపు ప్రకాశం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనుల్ని సమీక్షించారు. మొదటి సొరంగం పనులు దాదాపు పూర్తయ్యాయని, రెండవ సొరంగం పనులు ఆగస్టు నాటికి పూర్తి చేసి.. రెండు టన్నెల్స్‌కు నీళ్లిస్తామని అధికారులు తెలిపారు. ఇక అవుకు టన్నెల్-2 పనుల్లో ఫాల్ట్ జోన్‌లో మిగిలిన 137 మీటర్ల సొరంగం పనిని మార్చి వరకూ పూర్తి చేసి...వచ్చే ఖరీఫ్ సీజన్ కు 20 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తామని అధికారులు వివరించారు. Also read: Andhra Pradesh: దీపావళి వేడుకలపై వైఎస్ జగన్ సర్కార్ కీలక నిర్ణయం