AP EAPCET Counselling: ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల, గుర్తుంచుకోవల్సిన ముఖ్యమైన తేదీలు

AP EAPCET Counselling: ఆంధ్రప్రదేశ్‌లో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఏయే రోజుల్లో కౌన్సిలింగ్ జరుగుతుంది. ఏ సర్ఠిఫికేట్లు వెంట ఉంచుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 30, 2024, 05:57 AM IST
AP EAPCET Counselling: ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల, గుర్తుంచుకోవల్సిన ముఖ్యమైన తేదీలు

AP EAPCET Counselling: ఏపీఈఏపీసెట్ 2024 ద్వారా రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మా కోర్సుల్లో అడ్మిషన్లు చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో అడ్మిషన్ల కౌన్సిలింగ్ ప్రక్రియ రెండు సార్లు జరుగుతుంది. ఇంజనీరింగ్ విభాగాని ఓసారి, అగ్రికల్చర్, ఫార్మసీకు మరోసారి జరుగుతుంది. 

ఏపీలో ఇంజనీరింగ్ ప్రవేశాలకు సంబంధించిన కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఏపీఈఏపీసెట్ 2024లో అర్హత సాదించిన విద్యార్ధుల కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై 1 నుంచి 7 వరకూ జరుగుతుంది. అంటే జూలై మొదటి వారంలో ప్రోసెసింగ్ ఫీజు చెల్లింపు, రిజిస్ట్రేషన్ పూర్తవుతాయి. జూలై 4 నుంచి జూలై 10 వరకూ సర్టిఫికేట్ల ధృవీకరణ ఉంటుంది. కౌన్సిలింగ్ ఫీజు కింద 12 వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్ధులు అందులో సగం చెల్లిస్తే సరిపోతుంది. 

సర్టిఫికేట్ల వెరిఫికేషన్ తరువాత జూలై 8 నుంచి 12 వరకూ కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. జూలై 13న ఆప్షన్లు మార్చుకునేందుకు సమయం ఉంటుంది. జూలై 16న సీట్లు కేటాయిస్తారు. జూలై 17 నుంచి 22 మధ్యలో ఆయా కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ప్రతి ఏటా ఏపీఈఏపీసెట్ ద్వారా ఇంజనీరింగ్, బయో టక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్, బీటెక్ డెయిరీ టెక్నాలజీ, బీటెక్ ఫుడ్ సైన్స్‌తో పాటు బీఎస్సీ అగ్రికల్చర్, హార్టికల్చర్, బీ ఫార్మసీ, పార్మా డి, బీఎస్సీ నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి.

ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ తేదీలు

జూలై 1 నుంచి 7 వరకూ ప్రోసెసింగ్ ఫీజు చెల్లింపు
జూలై 4 నుంచి 10 వరకూ సర్టిఫికేట్ వెరిఫికేషన్
జూలై 8 నుంచి 12 వరకూ కళాశాలలు, కోర్సుల వెబ్ ఆప్షన్ల ఎంపిక
జూలై 13న వెబ్ ఆప్షన్ మార్పు
జూలై 16న సీట్ల కేటాయింపు 
జూలై 17 నుంచి 22 వరకూ కళాశాలల్లో రిపోర్ట్
జూలై 19 నుంచి తరగతులు ప్రారంభం

వెబ్ కౌన్సిలింగ్ హాజరయ్యేటప్పుడు ఏపీఈఏపీసెట్ 2024 ర్యాంకు కార్డు, హాల్ టికెట్, ఇంటర్ మార్కుల మెమో, పుట్టిన తేదీ ప్రూఫ్ కోసం పదో తరగతి మార్కుల మెమో, టీసీ, 6 నుంచి ఇంటర్ వరకూ స్టడీ సర్టిఫికెట్లు, ఈడబ్ల్యూఎస్ లేదా ఇతర సర్టిఫికేట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ తప్పకుండా వెంట ఉంచుకోవాలి.

Also read: Security Bonds Auction: వారంలో రెండోసారి, హామీల అమలుకు 7 వేల కోట్ల బాండ్ల అమ్మకాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News