Krishna River: కృష్ణానదిపై మరో రెండు బ్యారేజ్ లకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా డెల్టాను పునరుద్ధరించడం..కృష్ణా నీటి సద్వినియోగం. ఈ రెండింటి లక్ష్యంతో కృష్ణా నదిపై మరో రెండు బ్యారేజ్ ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు బ్యారేజ్ లు ప్రకాశం బ్యారేజ్ కు దిగువన నిర్మితం కానున్నాయి.

Last Updated : Sep 18, 2020, 12:58 PM IST
Krishna River: కృష్ణానదిపై మరో రెండు బ్యారేజ్ లకు గ్రీన్ సిగ్నల్

కృష్ణా డెల్టా ( Krishna Delta ) ను పునరుద్ధరించడం..కృష్ణా నీటి సద్వినియోగం. ఈ రెండింటి లక్ష్యంతో కృష్ణా నదిపై మరో రెండు బ్యారేజ్ ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ రెండు బ్యారేజ్ లు ప్రకాశం బ్యారేజ్ కు దిగువన నిర్మితం కానున్నాయి.

ఏపీ కృష్ణాడెల్టా ( Ap Krishna Delta ) ను పునరుద్దరించాల్సి ఉంది. డెల్టా చివరి వరకూ చాలా సందర్భాల్లో నీరు అందక..నిర్వీర్యమైపోతోంది. అందుకే ప్రకాశం బ్యారేజ్ ( Prakasam barrage ) కు దిగువన మరో రెండు చిన్న చిన్న బ్యారేజ్ ( Two more Barrages ) లు నిర్మించాలనే ప్రతిపాదన వచ్చింది. ఇటీవల జరిగిన కేబినెట్ ( Ap cabinet ) లో దీనికి ఆమోదం కూడా లభించింది. ఇప్పుడు ఆ బ్యారేజ్ ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ దీనికి సంబంధించిన తొలిదశ పాలనా అనుమతులు జారీ చేశారు. 

ఈ రెండు బ్యారేజ్ లలో ఒకటి ప్రకాశం బ్యారేజ్ కు 12 కిలోమీటర్ల దిగువన కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరంకు..గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపురం మద్యన నిర్మితం కానుంది. ఇక రెండవది..బ్యారేజ్ కు 62 కిలోమీటర్ల దిగువన మోపిదేవి మండలం బండికొల్లంక, గుంటూరు జిల్లా రేపల్లె మండలం రావి అనంతవరం మధ్యన నిర్మించనున్నారు. దీనికోసం  సర్వే, ఇన్వెస్టిగేషన్ పనులు, భూసేకరణల నిమిత్తం 204.37 కోట్లను మంజూరు చేశారు. Also read: Antarvedi: చలో అంతర్వేదికి అనుమతుల్లేవు..ఉల్లంఘిస్తే కఠిన చర్యలు

 

Trending News