AP Exams: ఏపీలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టు ముంగిట నడుస్తోంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షల నిర్వహణకు అనుమతి ఉంటుందన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపధ్యంలో..ప్రభుత్వం ఇవాళ అఫిడవిట్ సమర్పించింది.
ఆంధ్రప్రదేశ్‌లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల(Ap Exams) నిర్వహణకు త్వరలో గ్రీన్ సిగ్నల్ రానుంది. జూలై నెలలో పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షల నిర్వహణకు అనుమతిస్తానని సుప్రీంకోర్టు చెప్పడంతో..రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ అఫిడవిట్ సమర్పించింది. కోవిడ్ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. కోవిడ్ నివారణకై జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం(Ap government).
ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల్ని వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తామని..పరీక్ష గదిలో 15-18 మంది విద్యార్ధులు మాత్రమే ఉండేలా ఏర్పాట్లు చేస్తామని ప్రభుత్వం అఫిడవిట్లో పేర్కొంది. ప్రతి విద్యార్ధికి 5 అడుగుల దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని, భౌతిక దూరం, శానిటేషన్ వంటి అంశాల్ని కచ్చితంగా పాటిస్తామని తెలిపింది. విద్యార్ధుల కోసం ఎంట్రీ, ఎగ్జిట్ వేర్వేరుగా ఉంటాయని అఫిడివిట్లో(Affidavit) స్పష్టం చేసింది. విద్యార్ధుల భవిష్యత్ ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకునే పరీక్షల నిర్వహించాలనుకుంటున్నామని..అనుమతి ఇవ్వాలని అఫిడవిట్లో కోరింది. ఈ ఆఫిడవిట్‌పై విచారించి..కోర్టు తగిన నిర్ణయం తగిన జాగ్రత్తలు తీసుకుంటే పరీక్షల నిర్వహణకు అనుమతిస్తామని సుప్రీంకోర్టు (Supreme Court)ముందే చెప్పిన నేపధ్యంలో త్వరలో కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వవచ్చని తెలుస్తోంది.
Also read: Krishnapatnam Medicine: మందు పంపిణీకు ప్రభుత్వ సహకారం లేదు : ఆనందయ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook