AP SSC Results 2024 Date: మరో రెండు రోజుల్లో ఏపీ పదో తరగతి ఫలితాలు (AP SSC Results 2024) విడుదలకానున్నాయి. ఏప్రిల్ 22 ఉదయం 11 గంటలకు పదో తరగతి విడుదల చేయనున్నట్లు ఏపీ విద్యాశాఖ ప్రకటించింది. ఎల్లుండి(సోమవారం) మార్నింగ్ 11 గంటలకు రిజల్ట్ ను విజయవాడలోని తాజ్ హోటల్లో స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేయనున్నారు. విద్యార్థులు ఫలితాలను https://bse.ap.gov.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలో మార్చి 18 నుంచి 30 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. ఈ సంవత్సరం దాదాపు 6.30 లక్షలకు పైగా విద్యార్థులు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాశారు. పరీక్షల అనంతరం మూల్యాంకనం చేపట్టిన విద్యాశాఖ అధికారులు.. ఏప్రిల్ 8 నాటికి ప్రక్రియ పూర్తి చేశారు. కిందట ఏడాది పదో తరగతి ఫలితాలను మే 06న రిలీజ్ చేయగా..ఈసారి ఎన్నికల కారణంగా ముందుగానే విడుదల చేస్తున్నారు. దీంతో ఏప్రిల్ 22న ఫలితాలు రిజల్ట్ విడుదల చేయబోతున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ దేవానంద రెడ్డి అనౌన్స్ చేశారు.
ఫలితాలు చెక్ చేసుకోండిలా..
ముందుగా విద్యార్థులు SSC బోర్డు అధికారిక వెబ్ సైట్ https://www.bse.ap.gov.in/ లోకి వెళ్లండి.
ఆ తర్వాత హోమ్ పేజీలో కనిపించే "AP SSC Results 2024" లింక్‌పై క్లిక్ చేయండి.
అక్కడ హాల్ టికెట్ నంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
డిస్ ప్లే పై విద్యార్థి ఫలితాలు, మార్కులు కనిపిస్తాయి.
మార్కుల మెమోను డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకోండి.
Also Read: AP Election 2024: నెల్లిమర్ల జనసేన పార్టీ అభ్యర్థి ఆస్తులు విలువ అన్ని వందల కోట్లా?
Also Read: Tarak Ratna Wife: తారకరత్న భార్య సంచలన ప్రకటన.. ఏపీ ఎన్నికల్లో ఆమె మద్దతు ఎవరికి అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి