Rains in ap: ఓ వైపు ఎండలు మండుతున్నాయి. మరోవైపు నడి వేసవిలో వర్షాలు పడే సూచనలు కన్పిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలో అకాల వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతం( Bay of Bengal)లో ఏర్పడిన వాయుగుండం కారణంగా వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. నడి వేసవిలో సైతం వర్షాలు కురిసే సూచనలు కన్పిస్తున్నాయి. ఓ వైపు ఎండలు మండుతున్నా..వర్షాలు కూడా పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం మధ్య బంగాళాఖాతంలో అధిక పీడనం కొనసాగుతోంది.దీనికి తోడు దక్షిణ బంగాళాఖాతంలో వస్తున్న తేమగాలులు రాష్ట్రంపై విస్తరిస్తున్నాయి. ఫలితంగా గాలులు క్రమంగా దిగువకు వచ్చే అవకాశాలున్న నేపధ్యంలో ఈ నెల 16 నుంచి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ(IMD) తెలిపింది. ఈ నెల 16 నుంచి రాయలసీమలోని కర్నూలులో వర్షాలు ప్రారంభమై..అన్ని జిల్లాలకు విస్తరిస్తాయని..అటు కోస్తాంధ్రలో కూడా వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపారు.
ఏప్రిల్ 16 నుంచి 22వ తేదీ వరకూ రాష్ట్రంలో వర్షాలు (Rains) పడే సూచనలున్నాయని..ఫలితంగా ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంపై తక్కువ ఎత్తులో ఆగ్నేయ, దక్షిణ గాలులు వీస్తున్నాయి. ఈ కారణంగా ఇవాళ, రేపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్లు, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా,రాయలసీమలో మాత్రం పొడి వాతావరణం కొనసాగనుంది. గత 24 గంటల్లో కురుపాంలో 3.1 సెంటీమీటర్లు, గుమ్మలక్ష్మీపురంలో 2.7, చింటూరులో 2.1, రుద్రవరం, బుట్టాయగూడెంలలో 1.7, పెదకూరపాడులో 1.5సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Also read: Pawan Kalyan: హోం క్వారంటైన్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఫ్యాన్స్ టెన్షన్ టెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook