Liquor Price Down: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలో ప్రజలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంచి కిక్కు ఇచ్చే శుభవార్త వినిపించింది. భోగి రోజే మద్యం ధరలు భారీగా తగ్గించింది. కోడిపందాలతోపాటు మద్యంలో ప్రజలు మునిగితేలేందుకు ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధానం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రూ.99 కే క్వార్టర్ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. సోమవారం వైన్స్‌లలో రూ.99 కే క్వార్టర్ లభించింది. దీంతో ప్రజలు మందు కిక్కులో మునిగారు.
Also Read: Sankranti: సంక్రాంతికి పండుగకు సీఎం చంద్రబాబు దూరం? ఎందుకో తెలుసా?
మొత్తం 16 కంపెనీలతో మద్యం ధరల తగ్గింపుపై ప్రభుత్వం చర్చలు చేసింది. ఇప్పటికే పది కంపెనీలు తమ ఉత్పత్తుల ధరలు తగ్గించగా.. తాజాగా మరో ఆరు కంపెనీలు ధరలు తగ్గించేందుకు ముందుకువచ్చాయి. ఈ క్రమంలో మద్యం ధరలు భారీగా తగ్గాయి. కొన్ని ప్రముఖ బీర్ల ధరలు కూడా తగ్గడంతో ఫుల్ కిక్కు ఇచ్చే తగ్గించారు. దీంతో మందుబాబులు ఖుషీ అవుతున్నారు.
Also Read: Tirupati Stampede: తిరుపతి తొక్కిసలాటలో కీలక పరిణామం.. నలుగురు ఆఫీసర్ల సస్పెండ్
తగ్గుతున్న ధరలు
కూటమి నేతలు ఎన్నికల సమయంలో తక్కువ ధరలకే నాణ్యమైన మద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మద్యం పాలసీ అమల్లోకి తెచ్చారు. అందులో భాగంగా రూ.99 కే క్వార్టర్ మద్యం విక్రయిస్తున్నారు. దీనికి భారీ డిమాండ్ కనిపిస్తోంది. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన పలు మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉండగా వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. కాగా మరో ఆరు కంపెనీలు ధరలు తగ్గించడంతో తగ్గించిన ధరలతోనే మద్యం సరఫరా ప్రారంభమైంది.
ముందుకొస్తున్న కంపెనీలు
ఏపీలో రూ. 99కే క్వార్టర్ మద్యానికి భారీ డిమాండ్ లభిస్తోంది. మద్యం విక్రయాలు జోరందుకోవడంతో మరిన్ని కంపెనీలు తాము కూడా ఇదే రేటుకు మద్యం అందిస్తామని ముందుకువస్తున్నాయి. అమ్మకాలు పెరగడంతో మరింతగా విక్రయాలు పెరిగే అవకాశం ఉంది. ప్రముఖ కంపెనీలు ధరలు తగ్గించటంతో ఇతర కంపెనీల పైన ఒత్తిడి పెరిగింది. మార్కెట్‌లో ధరలు తగ్గించిన కంపెనీల బ్రాండ్ల అమ్మకాలు పెరిగాయి. ఇదే సమయంలో అధిక ధరలు విక్రయాలు చేసినా.. బెల్టుషాపులు నిర్వహించినా కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది. ఫలితంగా మద్యం విక్రయాలపై నిఘా పెరిగింది. దీంతో ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకునేలా కంపెనీలు ముందుకు వెళ్తున్నాయి.
తాజా ధరలు
- లిక్కర్ బ్రాండ్లలో క్వార్టర్‌పైనే రూ.20 నుంచి రూ.80 వరకు ధరలు తగ్గుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
- మాన్సన్ హౌస్ క్వార్టర్ సీసాపై రూ.30 తగ్గించింది.
- అరిస్ర్టోకాట్ ప్రీమియం సుపీరియర్ విస్కీ ధర రూ.50 తగ్గింది.
- కింగ్‌ఫిషర్ బీరు రూ.10 తగ్గింది
- బ్యాగ్‌పైపర్ గోల్డ్ రిజర్వ్ విస్కీ రూ.80 తగ్గుదల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.