Chandrababu Case Updates: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు వ్యవహారంలో ఇవాళ మద్యాహ్నం ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టులో కీలక పరిణామాలు జరగనున్నాయి. 14 రోజుల రిమాండ్ ముగియడంతో ఏసీపీ న్యాయస్థానం రిమాండ్‌ను కేవలం రెండ్రోజులు పొడిగించింది.
ఏపీ స్కిల్ కుంభకోణంలో అరెస్ట్ అయిన చంద్రబాబు రిమాండ్ ఇవాళ్టితో ముగిసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చంద్రబాబును ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. జైలులో ఏదైనా సమస్య ఎదురైందా అని న్యాయమూర్తి చంద్రబాబుని ప్రశ్నించారు. తానే తప్పూ చేయలేదని, దేశంలో అందరికీ తన గురించి తెలుసన్నారు. తనను అకారణంగా జైళ్లో పెట్టారనేదే తన ఆవేదనని చంద్రబాబు చెప్పారు. ఆ వివరాలన్నీ నోట్ చేసుకున్నానని చెప్పిన న్యాయమూర్తి..చట్టం అందరికీ సమానమనేనన్నారు. మీపై కేవలం ఆరోపణలున్నాయని, దర్యాప్తులో అన్నీ తేలుతాయన్నారు. రిమాండ్‌ను శిక్షగా భావించవద్దన్నారు. రిమాండ్ అనేది చట్ట ప్రకారం జరిగే ప్రక్రియగా వివరించారు.
చంద్రబాబు కస్టడీ కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటీషన్‌పై విచారణ ఇప్పటికే పూర్తయింది. దీనిపై ఇవాళ ఏసీబీ న్యాయస్తానం విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వ్ చేసింది. అటు ఏపీ హైకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై విచారణ పూర్తయి..తీర్పు రిజర్వ్‌లో ఉండటంతో ఏసీబీ కోర్టు రిమాండ్ కేవలం రెండ్రోజులే పొడిగించింది.
క్వాష్ పిటీషన్‌పై ఏపీ హైకోర్టులో మద్యాహ్నం 1.30 గంటలకు తీర్పు ఉన్న నేపధ్యంలో కస్టడీ పిటీషన్‌పై తీర్పును మద్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేసారు ఏసీబీ న్యాయమూర్తి. క్వాష్ పిటీషన్‌పై స్పష్టత వచ్చాక కస్టడీపై నిర్ణయం తీసుకోవాలనేది ఏసీబీ న్యాయమూర్తి ఆలోచనగా ఉంది.
Also read: AP Assembly: అసెంబ్లీలో బాలయ్య విజిల్, అచ్చెన్నాయుడు, అశోక్ సస్పెన్షన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook