Indrakeeladri Durgamma Temple: దేశంలోని ప్రఖ్యాతిగాంచిన విజయవాడ దసరా ఉత్సవాలు ఈసారి అస్తవ్యస్తంగా సాగాయి. విజయదశమి రోజున భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు అష్టకష్టాలు పడ్డారు. కొండలు గుట్టలు ఎక్కుతూ.. పోలీసుల ఆంక్షలను తెంచుకుని మరి అమ్మవారి దర్శనం కోసం ఎగబడ్డారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది, పోలీసులతో భక్తులు వాగ్వాదానికి దిగారు. కొన్ని చోట్ల తోపులాట చోటుచేసుకుని కొందరు భక్తులు అస్వస్థతకు గురయ్యారు.
Also Read: Taps Stolen: సర్కార్ నల్లాలు కూడా వదిలిపెట్టలేదు.. 9 లక్షల విలువైన ఇత్తడి నల్లాలు చోరీ
నవరాత్రి ఉత్సవాలు, దసరా సందర్భంగా ఇంద్రకీలాద్రి కొండపై కొలువుదీరిన దుర్గా మల్లేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో కొండ ప్రాంత కిటకిటలాడింది. భవానీ దీక్షాపరులు దీక్ష విరమించేందుకు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తజన సంద్రమైంది. పోలీసు ఆంక్షలతో దుర్గమ్మ ఆలయం అష్ట దిగ్బంధనంలో చిక్కుకుంది. గతంలో ఎన్నడు ఇలాంటి ఏర్పడలేదని భక్తులు చెబుతున్నారు.
Also Read: Priests: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆలయాల్లో అధికారులకు చెక్ పూజారులదే అధికారం
భక్తులపై పోలీసుల దౌర్జన్యం
రాజగోపురం వద్ద భవానీ భక్తులపై పోలీసులు దాడికి పాల్పడ్డారు. కొత్త కొత్త ఆంక్షలు పెట్టడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమ్మవారి దర్శనానికి పడరాని మార్గం కనిపించకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ అవస్థలు పడ్డారు. దారులు మూసుకుపోవడంతో కొండ పైకి వెళ్లేందుకు భక్తులు సాహసానికి ప్రయత్నించారు. విజయదశమి కావడంతో శనివారం భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది.
తోపులాట
విజయవాడ ఇంద్రకీలాద్రి పై అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు భక్తులకి పోలీసులు మధ్య తోపులాట చోటుచేసుకుంది. కొండ కింద గోపురం వద్ద నుంచి భక్తులు దోసుకుంటూ కొండపైకి ఎక్కే ప్రయత్నం చేయగా పోలీసులు చేతులెత్తేశారు. ఘాట్ రోడ్‌లో మరో రెండు ప్రదేశాల్లో కట్టడి చేసే ప్రయత్నం చేయగా పోలీసులను తోసుకుని భక్తులు కొండపైకి చేరుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి