AP House: ఏపీ ప్రజలకు చంద్రబాబు భారీ శుభవార్త.. వచ్చే నెలలో లక్ష ఇళ్లు పంపిణీ

One Lakh Houses Ready To Distribution From December In AP: ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు మరో హామీని నెరవేర్చనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పేదలకు ఇళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Nov 4, 2024, 10:39 PM IST
AP House: ఏపీ ప్రజలకు చంద్రబాబు భారీ శుభవార్త.. వచ్చే నెలలో లక్ష ఇళ్లు పంపిణీ

One Lakh Houses: ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పింఛన్ల పెంపు, దీపం సిలిండర్ల పంపిణీ అమలుచేసిన సీఎం చంద్రబాబు మరో హామీని నిలబెట్టుకునేందుకు సిద్ధమయ్యారు. ఇళ్లు లేని పేదలకు నివాస గృహాలు పంపిణీ చేయనున్నారు. డిసెంబర్‌లో లక్ష.. 2026 నాటికి 7.60 లక్షల ఇళ్లు ప్రజలకు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు.

Also Read: YSRCP: చంద్రబాబు అక్రమ కేసులు పెట్టినా బెదరకండి.. ధైర్యంగా ఉండండి

అమరావతిలోని సచివాలయంలో సోమవారం గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. డిసెంబర్‌లో లక్ష గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని చెప్పారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభించేందుకు కేంద్రంతో ఒప్పందం కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. 

Also Read: YS Vijayamma: కారు ప్రమాదం వార్తలపై కలత.. టీడీపీ సోషల్ మీడియాకు ఇచ్చిపడేసిన వైఎస్‌ విజయమ్మ

 

ఇళ్ల వివరాలు ఇవే!
సమీక్షలో రాష్ట్రంలో నిర్మించే ఇళ్ల వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక పీఎంఏవై అర్బన్ కింద 58,578 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణం కింద 17,197 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు తెలిపారు. లక్ష ఇళ్లు డిసెంబర్‌ నాటికి పూర్తవుతాయని.. లబ్ధిదారులకు ఇంటి తాళాలు అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

సరికొత్త సాంకేతికత
అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. 2026 నాటికి మరో 7.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని ఆదేశించారు. డ్రోన్ల ద్వారా ఇళ్ల నిర్మాణ నాణ్యత, కొలతలు తీసుకునేందుకు గృహ నిర్మాణ శాఖ పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిందని అధికారులు వివరించడంతో ఇదే సాంకేతికతను పెద్ద లేఅవుట్లలో కూడా వినియోగించాలని సీఎం చెప్పారు. ఆయా శాఖల సమన్వయంతో అన్ని లేఅవుట్‌లలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. 597 మందిని డిప్యుటేషన్ ద్వారా గృహ నిర్మాణ శాఖలోకి తీసుకునేందుకు తీసుకునేందుకు సీఎం అంగీకరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News