Contempt of Court: ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటీషన్, ప్రతివాదులు సీఎం జగన్, మంత్రులు బొత్స, బుగ్గన తదితరులే

Contempt of Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై మరో పిటీషన్ దాఖలైంది. అమరావతి రైతులు కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 23, 2022, 08:46 AM IST
  • ప్రభుత్వానికి కోర్టు తీర్పు అమలు చేసే ఉద్దేశ్యం లేనట్టుంది
  • ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన
  • ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణే అంటూ ఇద్దరు రైతుల పిటీషన్
Contempt of Court: ఏపీ ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ పిటీషన్, ప్రతివాదులు సీఎం జగన్, మంత్రులు బొత్స, బుగ్గన తదితరులే

Contempt of Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంపై మరో పిటీషన్ దాఖలైంది. అమరావతి రైతులు కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఏపీ రాజధాని అమరావతిలో కనీస సౌకర్యాలు మెరుగుపర్చాలని, 3 నెలల్లో ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని హైకోర్డు త్రిసభ్య ధర్మాసనం మార్చ్ 3వ తేదీన తీర్పునిచ్చింది. భూసమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందం మేరకు ఆరు నెలల్లో అమరావతి నగరాన్ని నిర్మించాలని, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోర్టు స్పష్టం చేసింది. అయితే హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం మౌళిక సదుపాయలు కల్పించలేదని..ఎక్కడి పరిస్థితి అక్కడే ఉందని..ఉద్దేశ్యపూర్వకంగానే కోర్టు ఉత్తర్వులు బేఖాతరు చేసిందని ఇద్దరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. హైకోర్చు తీర్పు అమలు చేయలేదంటూ కోర్టు ధిక్కార పిటీషన్ దాఖలు చేశారు. 

అమరావతి ప్రాంతంలోని యర్రబాలెం గ్రామ రైతు దోనె సాంబశివరావు, ఐనవోలుకు చెందిన తాటి శ్రీనివాసరావులు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. న్యాయస్థానం తీర్పును ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఉద్దేశ్యపూర్వకంగానే ఉల్లంఘించారనేది పిటీషనర్ల వాదన. మంత్రులు అధికారుల వెనుకుండి..కోర్టు ఆదేశాలు అమలు చేయకుండా చూస్తూన్నారని పిటీషనర్లు ఆరోపించారు. నిర్ధిష్ట సమయంలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోర్టు ఆదేశించినా..ఇప్పటివరకూ పనులు ప్రారంభించలేదని తెలిపారు. సీఆర్డీఏ చట్టం సెక్షన్ 61 పర్కారం టౌన్ ప్లానింగ్ స్కీమ్స్ అమలు చేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారన్నారు. అన్ని అంశాల్ని పరిగణలో తీసుకుని న్యాయస్థానం తీర్పు ఉల్లంఘన కింద..ప్రతివాదులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మంత్రి బొత్స, బుగ్గన, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, జీఏడీ సీఎస్ జవహర్ రెడ్డి, న్యాయశాఖ కార్యదర్శి సునీత, తదితరులపై చర్యలు తీసుకోవాలని పిటీషనర్లు కోరారు. 

Also read: CM Jagan Sensational Comments: చంద్రబాబు&కో కడుపు మంటతో రగిలిపోతుంది; సీఎం వైఎస్‌ జగన్‌

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News