Gold Production In AP: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అద్భుతమైన వార్త. ఇకపై బంగారు ఆంధ్రప్రదేశ్‌గా పిలువాల్సిన పరిస్థితి. ఎందుకంటే రాష్ట్రంలో బంగారు నిల్వలు వెలుగులోకి వచ్చాయి. ఆ నిక్షేపాలతో రాష్ట్రం బంగారుమయం కానుంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని పగిడిరాయి, జొన్నగిరి ప్రాంతాల్లోని ఎర్ర నేలల్లో బంగారు నిక్షేపాలు బయటపడ్డాయి. ఈ ఏడాది చివరి నాటికి తవ్వకాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పనులు మొదలైతే ప్రతి యేటా 750 కిలోల బంగారం వెలికి తీసే అవకాశం ఉంది.
Also Read: YS Jagan Foreign Trip: సీఎం వైఎస్ జగన్‌కు శుభవార్త.. విదేశీ ప్రయాణానికి సీబీఐ కోర్టు పచ్చజెండా
కర్నూలు జిల్లాలో దశాబ్దాలపాటు అన్వేషణ చేశారు. అన్వేషణలు ఫలించి ఈ ప్రాంతంలోని 1,500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఇక్కడ బంగారు తవ్వకాలకు దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) అనుబంధ సంస్థ అయిన జెమైసోర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక్కడ ఈ ఏడాది ఆఖరకు తవ్వకాలు ప్రారంభించనున్నట్లు సమాచారం.
Also Read: Pawan Kalyan: అజ్ఞానం ప్రదర్శించిన పవన్ కల్యాణ్?.. నవ్వుకుంటున్న ఓటర్లు
కాగా ఈ బంగారు గని ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. మన దేశంలో తొలి ప్రైవేటు రంగం బంగారం గని ఇదే కావడం విశేషం. ఈ గని కోసం ఇప్పటికే 250 ఎకరాలకు పైగా భూమిని సేకరించారు. అక్కడ ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణం చేపట్టగా దాదాపు 60% పనులు పూర్తయ్యాయి. ఈ ప్లాంట్ కార్యకలాపాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే యేటా 750 కిలోల బంగారాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది.
కర్నూలే కాదు ఇతర జిల్లాల్లోనూ బంగారు నిక్షేపాలు ఉన్నాయని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ బంగారు నిక్షేపాలు ఉన్నాయని సర్వలు జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిల్వలను కూడా గుర్తించారు. కానీ ఇంకా అభివృద్ధి పనులు జరగలేదు. ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్ ఆసక్తి కనబరుస్తోంది. వీటిపై ఇంకా అధికారికంగా వివరాలు రావాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter