Heavy Rains: ఏపీలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయగుండం కారణంగా మరో రెండు మూడ్రోజులు భారీ వర్షాలు కొనసాగనున్నాయని ఐఎండీ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడనున్నాయని, ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు పడుతున్నాయి. కొన్ని చోట్ల వర్షం లేకపోయినా ఆకాశమంతా మబ్బుపట్టి వాతావరణం చల్లగా మారిపోయింది. తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో మొన్న ఏర్పడిన అల్పపీడనం వాయగుండంగా మారడంతో రాష్ట్రంలో 2-3 రోజులు భారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరించింది. భారీ వర్షాలపై ఏపీ విపత్తు నిర్వహణ విభాగం సైతం హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్ర, కోస్తాంద్ర ప్రాంతాల్లో రానున్న 48 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఐఎండీ హెచ్చరించిన జిల్లాల్లో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు జిల్లాలున్నాయి. ఇక తూర్పు గోదావరి, కోనసీమ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో సైతం మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి.
ఇక ప్రకాశం, నంద్యాల, కడప, అన్నమయ్య ,కర్నూలు, శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. అదే సమయంలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశమున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ అధికారులు సూచించారు. ఇప్పటికే గుంటూరు, అనంతపురం, సత్యసాయి పుట్టపర్తి, కడప, ఏలూరు, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడుతున్నాయి. అటు ఉత్తరాంధ్ర, ఏజెన్సీ జిల్లాల్లో కూడా వర్షాలు రెండ్రోజుల్నించి దంచి కొడుతున్నాయి.
Also read: Godavari floods: ధవళేశ్వరం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద.. భయం గుప్పిట్లో ముంపు గ్రామాల ప్రజలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook