Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..

YS Jagan on laddu controvercy: వందరోజుల చంద్రబాబు పాలనలో అన్ని వ్యవస్థలు తిరోగమనం చెందాయని మాజీ సీఎం జగన్ అన్నారు. లడ్డు వివాదం కేవలం డైవర్షన్ రాజకీయాలన్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Sep 21, 2024, 08:52 AM IST
  • చంద్రబాబుపై మండిపడిన జగన్..
  • అక్రమ కేసులు పెడుతూ పైశాచీకం..
Jagan: దేవుళ్లపై కూడా రాజకీయాలు.. తిరుమల లడ్డు వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేసిన జగన్..

Ys Jagan on Laddu controvercy: మాజీ సీఎం వైఎస్ జగన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..కూటమి వందరోజుల పాలనలో ఏపీ తిరోగమనం చెందిందన్నారు. రైతులు రోడ్డున పడ్డాయన్నారు. రైతులకు 20 వేలు ఇస్తానని  ఇవ్వలేదన్నారు. రైతు భరోసా పెట్టు బడి సహాయంకూడా ఇవ్వలేదన్నారు. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవెన్ లేదని మండిపడ్డారు. అన్నిరంగాలు కూడా తిరోగమనం చెందాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో పథకాలన్ని డోర్ ముందుకు వచ్చేవన్నారు. ప్రజల జీవితాలలో చంద్రబాబు చెలగాటమాడుతున్నారన్నారు.

రెడ్ బుక్ పాలనతో అడ్డగోలుగా, న్యాయంను పాతరసి,  ఆస్తులు ధ్వంసం చేసి, దొంగకేసుల్లో ఇరికిస్తున్నారంటూ విమర్శించారు. కూటమి అన్నిరకాలుగా ఫెయిల్ అయిపోయిందన్నారు. ప్రతి అడుగులోను డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయన్నారు. ఆరోగ్య శ్రీ బకాయిలు ప్రభుత్వం చెల్లించలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ఇచ్చిన ఏ ఒక్క హమీలు కూడా నెరవేర్చలేదన్నారు.

చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసుల్లో అరెస్టు చేస్తే.. మరల డైవర్షన్ చేశారన్నారు. ముంబై నటి కాదంబరి జెత్వాని కేసుతో మరల డైవర్షన్ చేశారన్నారు. వరదలపై ముందే వాతావరణ శాఖ అలర్ట్ చేసిన కూడా.. చంద్రబాబు చర్యలు తీసుకొవడంలో విఫలమయ్యారన్నారు.  విజయవాడలో, ఏలేరులో జరిగిన నష్టానికి చంద్రబాబు కారణమన్నారు. దీనిపై బోట్లతో డైవర్షన్.. ఇలా ప్రతిదాంట్లో డైవర్షన్ లు చేస్తున్నారన్నారు.

చివరకు దేవుడిపై లడ్డుపై కూడా డైవర్షన్ పాలన చేస్తున్నారన్నారు. కేవలం ప్రజల మనస్సులను డైవర్ట్ చేసేందుకు, లడ్డు కాంట్రవర్షీ తెరమీదకు తెచ్చారన్నారు. దేవుడిని కూడా రాజకీయాలు చేస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఎనిమల్ ఫ్యాట్ వాడారని, భక్తులు తిన్నారని కూడా చంద్రబాబు చేయడం కూడా ఎంత వరకు కరెక్ట్ అని వైఎస్ జగన్ అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు.. తిరుమలలో అనేక మంచి పనులు చేశామన్నారు.

నవనీత శోభ, గోశాల, శ్రీవారి ఆలయం సిబ్బంది పెంచామన్నారు. చంద్రబాబు దేవాలయాలను కూల్చేస్తే.. ఏపీవ్యాప్తంగా ఉన్న జీర్ణవ్యవస్థలో ఉన్న అనేక  ఆలయాల్ని పునరుద్ధారించామన్నారు. వైవీ సుబ్బా రెడ్డి.. 45 మార్లు భక్తితో మాలలు వేసుకున్నారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంకటేశ్వర స్వామిని రోడ్డు మీదకు తెచ్చే పనులు చేస్తున్నారు. పీఎంకు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు కూడా లేఖలు రాస్తా.. అంటూ ఫైర్ వైఎస్ జగన్ మండిపడ్డారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News