Muppa Raja Suspend: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి పండుగ జోరుగా సాగింది. రాజకీయ పార్టీలు స్వయంగా పాల్గొని పండగకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశాయ. ఈ క్రమంలో పెనమలూరు జనసేన పార్టీ ఇన్‌చార్జ్ కూడా సంక్రాంతి పండుగకు భారీ ఏర్పాట్లు చేశాడు. పార్టీ కార్యకర్తలతోపాటు ప్రజలకు వినోదం.. పండుగ సంబరం అందించగా అదే అతడిపై వేటు పడేలా చేసింది. పార్టీ క్రమశిక్షణా నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని భావించి అతడిని జనసేన పార్టీ సస్పెండ్ చేసింది.
Also Read: Liquor Price Down: ఏపీ ప్రజలకు 'సంక్రాంతి కిక్కు'.. భారీగా మద్యం ధరలు తగ్గుముఖం
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జనసేన పార్టీ సమన్వయకర్త ముప్పా రాజా భారీ ఏర్పాట్లు చేశాడు. జూద క్రీడలు, కోడిపందాల బరులు ఏర్పాట్లు చేసి జోరుగా పండుగ వాతావరణం ఉండేలా చేశాడు. జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో పందాల బరిని ఏర్పాటు చేయించాడు. కంకిపాడు మొత్తం జనసేన జాతరగా మారింది. అయితే జాతీయ రహదారి పక్కన ఉన్న సర్వీస్ రోడ్డుపై టోల్ వసూలు చేయడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టోల్ చెల్లించకుండా వాగ్వాదానికి దిగారు.
Also Read: Sankranti: సంక్రాంతికి పండుగకు సీఎం చంద్రబాబు దూరం? ఎందుకో తెలుసా?
టోల్ వసూలు చేయడంతోపాటు జూద క్రీడలు నిర్వహించడం జనసేన పార్టీ తీవ్రంగా పరిగణించింది. పార్టీ విధానాలకు విరుద్ధంగా ముప్పా రాజా వ్యవహరించినట్లు పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భావించారు. అతడు చేసిన చర్యను తీవ్రంగా పరిగణించి రాజాను సస్పెండ్ చేయాలని పార్టీకి ఆదేశించడంతో అతడిని సస్పెండ్ చేశారు. జనసేన పార్టీ కార్యకలాపాలతో రాజాకు ఎలాంటి సంబంధం ఉండదని జనసేన పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది.
మరికొందరిపై కూడా
జనసేన జెండాలు, ఫ్లెక్సీలతో కంకిపాడులో హల్‌చల్ చేయడాన్ని పార్టీ తీవ్రంగా పరిగణించింది. నిర్వాహకుడు ముప్పా రాజాతోపాటు బరిలో పాల్గొన్న నాయకుల వివరాలను జనసేన పార్టీ నాయకత్వం సేకరిస్తోంది. ఈ సందర్భంగా ఈ వేడుకల్లో పాల్గొన్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు కోడి పందాలు యథేచ్ఛగా నిర్వహించగా.. ఒక్క ముప్పా రాజాను సస్పెండ్ చేయడం వెనుక కారణమేమిటా? అనేది చర్చనీయాంశంగా మారింది. మిగతా నాయకులపై చర్యలు తీసుకోరా? అనే డిమాండ్ వ్యక్తమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.